ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 45ఏళ్లకే ఫించన్ అంశం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని కుదిపేసింది. అసలు ఇంతకీ ఈ విషయంలో జగన్ ఏం చెప్పాడు.. ఆ తర్వాత దాన్ని ఎలా సవరించుకున్నాడు.. దీన్ని టీడీపీ ఎలా వక్రీకరిస్తోంది.. ఓ సారి పరిశీలిద్దాం.


2017 సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 45ఏళ్లకే ఫించన్ ఇస్తానని జగన్ చెప్పారు. సాక్షాత్తూ జగన్ సొంత మీడియా సాక్షిలోనే ఆ వీడియో ప్రసారమైంది కూడా. అయితేఆ తర్వాత జగన్ స్టాండ్ మార్చుకున్నారు. ఆ విషయాన్ని జనంలో బహిరంగంగానే ప్రకటించారు. దీనికీ వీడియో సాక్ష్యం ఉంది.


దాన్నే వైసీపీ అసెంబ్లీలో ప్రదర్శించింది. అందులో జగన్ ఏమన్నారంటే.. “ 45 ఏళ్లుకు పెన్షన్‌ ఇవ్వాలని నేను చెబితే.. 45 ఏళ్లకే అక్కలకు పెన్షన్‌ ఏమిటని కొందరు వెటకారం చేశారు. వెటకారం చేస్తూ వారు చేసిన సూచనలను కూడా పరిగణనలోకి తీసుకొని వైఎస్సార్‌ చేయూత అనే కొత్త పథకానికి నాందిపలుకుతున్నాం. 45 ఏళ్లు దాటిన ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్కలకు, ప్రతి కుటుంబానికి అక్షరాల 75వేల రూపాయలు ఉచితంగా ఇస్తాం.


రెండో ఏడాది నుంచి దశలవారీగా ఆయా కార్పొరేషన్‌ల ద్వారా పూర్తి పాదర్శకతతో, ఏమాత్రం అవినీతి తావు లేకుండా.. ప్రతి అక్కకు అందేవిధంగాచూస్తాం’ అని వైఎస్‌ జగన్‌ వీడియోలో తెలిపారు.


ఇదీ విషయం కానీ చంద్రబాబు జగన్ మొదటి ప్రకటననే చూస్తారు.. రెండోదాన్ని కావాలనే చూడరు. ఎందుకంటే దాన్ని చూస్తే యాగీ చేయడానికి అవకాశం ఉండదు కదా. అదీ సంగతి.


మరింత సమాచారం తెలుసుకోండి: