ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల రేషన్ డీలర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి తీసుకున్న సంచలన నిర్ణయాలలో భాగంగా గ్రామ వాలంటీర్ల నియామకాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఇంటింటికి బియ్యం, రేషన్ సరుకుల సరఫరాకు కార్యాచరణ చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. రేషన్ సరఫరాల్లో అవినీతిని నియంత్రించేందుకు నాలుగు లక్షల మంది గ్రామ వాలంటీర్లను నియమించేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా గ్రామ వాలంటీర్ల నియామకంతో తమ ఉపాధి దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని రేషన్ డీలర్లు ఆందోళన చెందుతున్నారు. జీతాలు లేకున్నా కమీషన్ పైనే ఆధారపడి జీవిస్తున్నామని తమ ఉపాది దెబ్బతీయడం తగదని వారు మంత్రులకు విన్నమించుకున్నారు. ఈ నేపథ్యంలో వారి గోడు ముఖ్యమంత్రి దృష్టికి చేరడంతో రాష్ట్ర న్యాయకత్వంతో  సమీక్షించారు. 

గ్రామ వాలంటీర్ల నియామకం అనంతరం వారంత  రేషన్ డీలర్ల నుంచే సరుకులు తీసుకొనే విధంగా మార్పులు చేయనున్నారు. ఈ విషయాన్ని పౌరసరఫరాల శాఖా మంత్రి స్పష్టం చేయడంతో రేషన్ డీలర్లు ఊరట చెందారు. తమ ఉపాధికి భంగం వాటిల్లుతుందని ఆందోళనకు గురైన రేషన్ డీలర్లు ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల  హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: