క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం చాలా గ్రామాల్లో పార్టీ నేతలు రెండువర్గాలుగా చీలిపోయారట. ఆవిర్భావం నుండి పార్టీలోను ఉంటూ కష్టపడిన నేతలు, మద్దతుదారులు ఒక గ్రూపైతే మధ్యలో వచ్చి పెత్తనం చేస్తున్నవారు రెండో గ్రూపట. మొత్తం మీద రెండు గ్రూపులు ఎవరిస్ధాయిలో వాళ్ళు  వైసిపి అధికారంలోకి రావటానికి  కష్టపడిన వారే.

 

ప్రతిపక్షంలో ఉన్నంత కాలం గ్రూపుల ఆధిపత్య గొడవలు పెద్దగా బయటపడలేదు. ఎప్పుడైతే వైసిపి అధికారంలోకి వచ్చిందో వెంటనే ఆధిపత్య గొడవలు పెరిగిపోయాయి. దాంతో గ్రూపుల గొడవలు రోడ్డున పడుతున్నాయని సమాచారం.  ప్రభుత్వం నుండి పార్టీ నుండి వచ్చే ఏ ప్రయోజనమైనా ముందు తమకే అందాలని మొదటి గ్రూపు పట్టుబడుతోందట.

 

అదే సమయంలో తమకు పరిచయం ఉన్న నేతల ద్వారా రెండో గ్రూపు కూడా పదవుల కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. గ్రామ, వార్డు వాలంటీర్ల నియమాకాల్లో ఈ గొడవలు బాగా కనబడుతున్నాయని పార్టీ నేతలే చెబుతున్నారు. ఉన్నవే కొన్ని పోస్టులు కావటం, అదికూడా ఉన్న చోటే నెలకు 5 వేల రూపాయల వేతనం వస్తుండటంతో నేతలు ఎవరికి వారుగా తమ మద్దతుదారులకే పోస్టులు ఇప్పించుకునేందుకు పోటీలు పడుతున్నారు. దాంతో గ్రూపుల గోల పెరిగిపోతోంది.

 

ప్రతీ చిన్న విషయానికి లేదా అయాచిత లబ్దిని అందుకోవాలన్న దురాశతోనే టిడిపి హయాంలో జన్మభూమి కమిటిలు పెద్ద మాఫియా లాగ తయారయ్యాయి. దాంతో అప్పుడు కూడా టిడిపిలో గ్రూపులుగా నేతలు విడిపోయి గొడవలుపడ్డారు. దాంతో జనాలు వీళ్ళని అసహ్యించుకుని చివరకు ఎన్నికల్లో వైసిపికి పట్టంకట్టారు. వైసిపి అధికారంలోకి వచ్చిన వెంటనే  పార్టీలో  జరుగుతున్న గొడవలను అదుపు చేయకపోతే తొందరలోనే వచ్చే పంచాయితీ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపటం ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: