కర్ణాటకలో కుమారస్వామి సర్కారు అల్పాయుష్షుతోనే అంతరించింది. దినదినగండంగా సాగిన కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణం కథ ముగిసింది. కర్ణాటక అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలో సంకీర్ణ సర్కారు నలుగురు ఎమ్మెల్యేల మద్దతు కరవై అధికారం కోల్పోయింది.


కుమారస్వామి ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 99 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఓటు వేశారు. విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 105 మంది ఓటేశారు. సభలో హాజరైన వారి సంఖ్యను లెక్కలోకి తీసుకుంటే 103 మేజిక్ ఫిగర్ గా ఉంది.


దీంతో.. తగినంత మెజారిటీ సాధించలేకపోవడంతో కుమార స్వామి నేతృత్వంలోని కాంగ్రెస్- జేడీఎస్ సర్కారు కథ ముగిసింది. కుమార స్వామి సర్కారు మెజారిటీ సాధనలో విఫలమైన నేపథ్యంలో కర్ణాటక బీజేపీలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.


స్పీకర్ కుమార స్వామి సర్కారు విశ్వాసం కోల్పోయిందని ప్రకటించగానే... బీజేపీ సభ్యులంతా ఆనందంతో చప్పట్లు కొట్టారు. బీజేపీ నేత యడ్యూరప్పకు అభినందనలు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: