గత 14 నెలలుగా కర్ణాటకలో పరిపాలన సాగిస్తున్న కాంగ్రెస్.. జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి నేటితో తెరపడింది.  గత వారం రోజులుగా కర్ణాటకలో అనిశ్చితి నెలకొంది.  సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన 15 మంది సభ్యులు రాజీనామాలు చేయడంతో ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది.  


రాజీనామాలు ఆమోదించాలని స్పీకర్ పై ఒత్తిడి తీసుకొచ్చారు.  కానీ కుదరలేదు.  అలా నెట్టుకుంటూనే వస్తున్నారు.  చివరకు ఈరోజు బలపరీక్షను నిర్వహించాల్సి వచ్చింది.  డివిజన్ పద్దతిలో నిర్వహించిన ఈ పరీక్షలో కుమారస్వామి ప్రభుత్వం ఓటమిపాలైంది.  


ప్రభుత్వానికి అనుకూలంగా 99 మంది ఉంటె.. ప్రతిపక్షానికి అనుకూలంగా 105 ఓట్లు వచ్చాయి.  దీంతో బలపరీక్షలో ప్రభుత్వం ఓటమిపాలైనట్టు స్పీకర్ రమేష్ కుమార్ ప్రకటించారు.  బలం నిరూపించుకోలేకపోవడంతో... కుమారస్వామి రాజీనామా చేసే అవకాశం ఉంటుంది.  


కుమారస్వామి ఈరోజు గవర్నర్ ను కలిసి రాజీనామా సమర్పించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.   యడ్యూరప్ప ఆధ్వర్యంలో త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.  అయితే, ఎప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అన్నది తెలియాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: