తూర్పుగోదావరి జిల్లా మండపేట సమీపంలోని విజయలక్ష్మీ నగర్‌లో అపహరణకు గురైన బాలుడి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. నిన్న రాత్రి సాయిధరణి అపార్ట్‌మెంట్‌ వద్ద జరిగిన అపహరణ ఘటన తీవ్ర కలకలం రేపింది. అపార్ట్‌మెంట్‌లో నానమ్మతో పాటు వెళ్తున్న జషిత్‌ అనే ఐదేళ్ల బాలుడిని గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు అపహరించారు. జషిత్‌ తల్లిదండ్రులిద్దరూ బ్యాంకు ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. కుమారుడి అపహరణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడి ఆచూకీ కోసం ఏడు బృందాలతో గాలిస్తున్నట్టు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం హస్మీ వెల్లడించారు. అన్ని చెక్‌పోస్టులు, బస్టాండ్‌, రైల్వేస్టేషన్లలో అప్రమత్తం చేశామన్నారు.

అపహరణకు ఆర్థిక లావేదేవీలే కారణమనే కోణంలోనూ విచారిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు నిందితుల నుంచి ఎలాంటి ఫోన్‌ రాలేదన్నారు. నిన్న రాత్రి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిన సమయంలో నిందితులు బాలుడిని అపహరించారని.. కొందరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు చెప్పారు. బాలుడి అపహరణ కేసును ఛేదిస్తామన్నారు. ఈ ఘటనకు వారం రోజుల ముందు నుంచి సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని ఎస్పీ తెలిపారు. బాలుడి తల్లిదండ్రులకు ఎవరైనా శ్రతువులు ఉన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


శ్రీకాకుళం నుండి వచ్చి....
ప్రశాంతత కు పెట్టింది పేరు మండపేట. ఇక్కడ నివసిస్తున్న వారు ఈ పట్టణాన్ని వదిలి వెళ్ళేందుకు ఇష్ట పడారు. అలాంటి పట్టణంలో కిడ్నాప్ కలవరపాటు కు గురిచేసింది. శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన భార్య భర్త లు చెరో బ్యాంక్ లో ఉద్యోగలు చేస్తూ ఆనందంగా జీవిస్తున్న తరుణంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. నూక వెంకట రమణ ది శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం కనుగులవలస స్వస్థలం. ఉద్యోగం లో స్థిరపడ్డ అనంతరం శ్రీకాకుళం పట్టణంలో ఇల్లు నిర్మించుకున్నరు. ఆరు నెలలు క్రితం మండపేట యూనియన్ బ్యాంకు లో అసిస్టెంట్ మేనేజర్ గా వచ్చారు.

ఈయన భార్య బెండీ నాగావళి కూడా స్థానిక కెనరా బ్యాంకు లో అసిస్టెంట్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి నాలుగేళ్ళ జషిత్ వున్నాడు.కాగా ఆమె ఇప్పుడు నిండు గర్భిణీ. ఆనందంగా సాగిపోతున్న వీరి జీవితంలో కిడ్నాప్ కన్నీళ్లు రప్పిస్తుంది. ముద్దులు ఒలికించే జషి త్ అంటే అక్కడి అపార్టుమెంట్లు వారందరి ఎంతో ఇష్టం.అలాంటి చిన్నారి కిడ్నాప్ కావడంతో వారంతా ఆందోళనకు గురయ్యారు. ఇరువురి బ్యాంకు సహా ఉద్యోగులు అక్కడికి చేరుకుని వారిని ఓదరించారు.తన కుమారుడు ఆచూకీ కోసం ఆ తల్లి తల్లడిల్లడం చూపరులను సైతం కంట కన్నీరు రప్పించింది. బాలుడి ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని డి ఎస్ పి కోరారు.



మరింత సమాచారం తెలుసుకోండి: