కర్ణాటకలో కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ సర్కారు కథ ముగిసింది. అసెంబ్లీలో సీఎం కుమార స్వామి బలం నిరూపించుకోలేకపోవడంతో సంకీర్ణ సర్కారు కుప్పకూలింది. దీంతో సీఎం కుమార స్వామి రాజీనామా చేయడం ఖాయమైపోయింది.


మరి ఇప్పుడు కర్ణాటకలో ఏం జరుగుతుంది. కొత్త సీఎంగా ఎవరు ఉంటారు. గవర్నర్ ఏం చేస్తారు.. ఇప్పుడు ఇవే హాట్ టాపిక్ గా మారిన అంశాలు. గవర్నర్ బీజేపీ వ్యక్తిగా పేరు ఉండటంతో.. మరోసారి బీజేపీకి అవకాశం ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.


అదే జరిగితే.. మరోసారి యడ్యూరప్ప సీఎం అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. గవర్నర్ కనుక యడ్యురప్పకు సీఎంగా అవకాశం ఇస్తే.. ఆయన బలం నిరూపించుకోవడం కూడా సులభమే. ఇప్పటికే.. బీజేపీ కుమార స్వామి సర్కారును పడగొట్టడం ద్వారా పరోక్షంగా అసెంబ్లీలో తన బలం నిరూపించుకుంది.


గవర్నర్ యడ్యూరప్పకు అవకాశం ఇస్తే ఇదే సీన్ మరోసారి రిపీట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కుమార స్వామి సర్కారు కూలిపోగానే..ఇది కర్ణాటక ప్రజల విజయం అంటూ బీజేపీ అధికారక ట్విట్టర్ నుంచి సందేశం పోస్టు చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: