ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి  అమెరికా పర్యటనకు  వెళ్లనున్నారు. వారం రోజుల పాటు అయన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాలో పర్యటిస్తారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జగన్ తొలిసారిగా అమెరికాకు వెళ్తున్నారు.  ఆగస్టు  17వ తేదీ నుండి 23వ తేదీవరకు అమెరికాలో పర్యటించనున్న జగన్,  అమెరికాలో నార్త్ అమెరికా తెలుగు కమ్యూనిటీ ఆహ్వాన సభలో  పాల్గొంటారు.


డల్లాస్‌లో జరిగే కేబెల్లే కన్వెన్షన్ సెంటర్‌లో ప్రవాస భారతీయులు నిర్వహించే భారీ సభలో కూడా ఆయన  పాల్గొననున్నారు . అలాగే అమెరికా కు వెళ్లేముందు జగన్, జెరూసలెం వెళ్లాలని నిర్ణయించుకున్నారు . ప్రతి ఏటా జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన జెరూసలెం ను సందర్శించుకోవడం ఆనవాయితీ. ఆగస్టు ఒకటవ తేదీన జెరూసలెం చేరుకొని ఐదు రోజులపాటు పర్యటించి, తిరిగి అనంతరం అమెరికా కు చేరుకొని తిరిగి  అమరావతికి చేరుకోనున్నారు .


ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఒకటి వెంట , మరొకటి సంచలన నిర్ణయాలతో అందరి ఆదరణ చూరగొంటున్న జగన్, అమెరికా ఎన్నారైల మనస్సులను ఎంతవరకు  చూరగొంటున్నారన్నది ఆసక్తికరంగా మారింది. అమెరికా పర్యటన లో భాగంగా ఎన్నారై లను ఆకట్టుకుని రాష్ట్రానికి ఎంతమేరకు పెట్టుబడులు తీసుకు వస్తారో చూడాలని పరిశీలకులు పేర్కొంటున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: