వైకాపా ప్రభుత్వం పై , ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఫైరయ్యారు . జగన్ మాట తప్పి , మడమ తిప్పారని ఆమె విమర్శించారు . ఇటీవల కాలం టీడీపీ నేతలు ఎవరు కూడా వైకాపా ప్రభుత్వాన్ని , జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయతను ప్రశ్నించే సాహసం చేయలేదు . కానీ తొలిసారిగా వైకాపా ప్రభుత్వాన్ని తంగిరాల సౌమ్య టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు . ఎస్.సి, ఎస్.టి, బి.సి మహిళలకు 45 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి , వారి  ఆర్ధిక ఇబ్బందులను ఆసరా చేసుకొని ఆశ పెట్టి ఓట్లు దండుకున్నారని విమర్శించారు .


 ముఖ్యమంత్రి  కాగానే ఆ మాట తప్పారని ,  అది మడమ తిప్పటం కదా అని  జగన్ ను ఆమె ప్రశ్నించారు .  ఇదేనా నువ్వు నిత్యం చెప్పే విశ్వసనీయత అంటూ తంగిరాల సౌమ్య నిలదీశారు .   జగన్  మాటలు నమ్మి ఓట్లు వేసినందుకు  మహిళలు మనోవేదనకు గురవుతున్నారని అన్నారు . అమ్మ ఒడి ద్వారా ప్రతి విద్యార్ధికి 15 వేలు ఇస్తానని చెప్పిన జగన్ , ఇప్పుడు మాటమార్చి  ఇంటికి ఒకరు అని చెప్పడం ద్వారా,  మరో పిల్లవాడికి విద్య లేకుండా చేస్తున్నారని, ఇది   మడమ తిప్పడం కదా అని సౌమ్య ప్రశ్నించారు . జగన్మోహన్ రెడ్డి  అవినీతి చరిత్ర తెలిసే, రుణం ఇచ్చేందుకు  ప్రపంచ బ్యాంకు వెనక్కి వెళ్లిందన్న సౌమ్య అన్నారు .


పరిశ్రమల స్థాపన దిశగా సాగుతున్న ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ ఏర్పాటు అనంతరం , పరిశ్రమలు వెనక్కి వెళ్తున్నాయని చెప్పారు .  జగన్ ప్రభుత్వ  విద్యుత్ విధానాల వల్ల...  అప్రకటిత కరెంటు కోతలతో ఉన్న పరిశ్రమలు మూతపడే   పరిస్థితి నెలకొందని అన్నారు .  ఆంధ్రప్రదేశ్ ను  గాడిలో పెట్టేందుకు అసెంబ్లీ లో టీడీపీ  శాసన సభ్యులు పోరాటం చేస్తూ ఉంటే  తట్టుకోలేక సస్పెండ్ చేయడం హేయ మైన చర్య అంటూ మండిపడ్డారు .

 


మరింత సమాచారం తెలుసుకోండి: