కర్ణాటకలో జేడీఎస్.. కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వానికి తెరపడింది.  ఈరోజు జరిగిన బలనిరూపణలో కుమారస్వామి ప్రభుత్వం ఓటమిపాలైంది.  అధికారంలో ఉన్న సంకీర్ణం ప్రభుత్వానికి కేవలం 99 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉన్నది.  కాగా, బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉండటంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నది.  


ఇప్పుడు ఇదే తరహా ప్రయోగాన్ని మధ్యప్రదేశ్ లో కూడా ప్రయోగించేందుకు బీజేపీ సిద్ధమైనట్టు కనిపిస్తోంది.  గత మూడు టర్మ్ లుగా బీజేపీ అక్కడ అధికారంలో ఉన్నది.  చాలా కాలం తరువాత అధికారం మార్పిడి జరిగింది.  శివరాజ్ సింగ్ ప్రభుత్వంపై వ్యతిరేకం లేకపోయినా అధికారం బదలాయించాలని ప్రజలు కోరుకోవడంతో బదలాయింపు జరిగింది.  


అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 114 మంది ఎమ్మెల్యేలు ఉండగా, బీజేపీకి 109 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.  ఎస్పీ, బీఎస్పీ, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల సపోర్ట్ తో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.  అధికారంలోకి రావాలంటే 116 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది.  


కాగా, కర్ణాటకలో అసమ్మతితో ఉన్న ఎమ్మెల్యేల సహాయంతో బీజేపీ సర్కారును కూల్చివేసింది.  ఇదే తరహా ప్రయోగాన్ని మధ్యప్రదేశ్ లో కూడా అమలు చేసేందుకు సిద్దమైందా అంటే... ఏమో చెప్పలేమని చెప్పాలి.  ఒకవేళ అనుకుంటే ఈ సమయంలో బీజేపీ చేసినా చెయ్యొచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: