అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు ముగ్గురు తెలుగుదేశం పార్టీ సభ్యులను సస్పెండ్ చేయడం పట్ల ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పై ఆయన పార్టీ సీనియర్లతో సమాలోచనలు చేస్తున్నారు . ఇకపై  అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడమా ?, లేకపోతే సస్పెండ్ అయిన తమ సభ్యులకు మద్దతుగా సమావేశాలను బహిష్కరించడమా ?? అన్నదానిపై సీనియర్ల అభిప్రాయాలను చంద్రబాబు తెలుసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి  .


 ఎన్నికల ముందు ప్రభుత్వం వైకాపా ఇచ్చిన హామీలను గుర్తుచేసే తమ పార్టీ సభ్యులను సస్పెండ్ చేయడం ఏమిటని ఈ సందర్బంగా చంద్రబాబు ప్రశ్నించారు  . తమ పార్టీ కి చెందిన బీసీ నాయకులు సస్పెండ్ చేసి, అధికార పార్టీ  బిసి బిల్లుపై చర్చించడం ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు .  పులివెందుల తరహా పాలన ప్రజల్లో భయం మొదలైందన్న చంద్రబాబు ,  టీడీపీ పై బురద జల్లే ప్రయత్నం లోభాగంగానే ,  తమ పార్టీకి చెందిన ముగ్గురు డిప్యూటీ లీడర్లను  సస్పెండ్ చేశారని  అన్నారు .


అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయోమోనని టీడీపీ సీనియర్లు పేర్కొన్నట్లు తెలుస్తోంది . గతం లో పార్టీ ఫిరాయింపులను నిరసిస్తూ , వైకాపా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తే తాము తీవ్ర విమర్శలు చేశామని , మనం ఇప్పుడు అదే పని చేస్తే ప్రజల్లో చులకనయ్యే ప్రమాదముందని వ్యాఖ్యానించినట్లు సమాచారం .


మరింత సమాచారం తెలుసుకోండి: