జగన్ తన విజన్ తో దూసుకుపోతుంటే.. సపోర్ట్ చెయ్యాల్సిన  వైసీపీ నాయకులే  జగన్‌ పై  పగ బడుతున్నారా... జగన్ పై వాళ్ళ కోపానికి చాలా కారణాలే ఉన్నాయా..  ముఖ్యంగా జగన్ కోసం గత తొమ్మిదేళ్ళుగా కష్టపడినా,  తమకు సరైన గౌరవం  జగన్ ఇవ్వడంలేదని  ఆ కొంతమంది   వైసీపీ నేతలు రోజురోజుకి లోలోలే అసంతృప్తిని పెంచుకుంటున్నారా... ఈ ప్రశ్నలకి అవుననే అనుకోవాలి.  నిజానికి  ఆ నాయకుల్లో వైసీపీ పుట్టిన దగ్గర నుండీ  పార్టీకి సపోర్ట్ గా  జగన్ వెంటే నడిచిన సీనియర్ నాయకులు కూడా ఉన్నారు.  అయితే వాళ్ళను కాదని   పార్టీలోకి  కొత్తగా వచ్చిన నాయకుల్లో చాలమందికి జగన్ పదవులు కట్టబెట్టారని.. పైగా కీలక ప్రభుత్వ నిర్ణయాల్లో కూడా  వారికే ఎక్కువుగా  ప్రాముఖ్యత ఇస్తున్నారని  ఆ నాయకులూ  భావిస్తున్నారు. 


 జగన్ కాంగ్రెస్‌ ను వీడినప్పుడు  ఇప్పుడు పదవులు దకించుకున్న ఆ కొత్త నేతల్లో  ఒక్క ఎమ్మెల్యే కూడా  అప్పుడు జగన్ వెంట రాలేదని.. మొత్తానికి  పార్టీ కోసం, జగన్ కోసం పనిచేసిన క్యాడర్‌ ను  పక్కనబెట్టి  ఫిరాయింపు ద్వారా వచ్చిన నేతలకే జగన్ మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులు కట్టబెడుతున్నారని వాళ్ళు జగన్ పై  పగను  పెంచుకుంటున్నారట.  ముఖ్యంగా అవంతి శ్రీనివాస్‌ లాంటి నాయకులకు టికెట్ ఇచ్చి   ఏకంగా మంత్రి పదవిలను కూడా ఇవ్వడం అసలు బాగాలేదని ఆ నేతల అభిప్రాయం.  


ఏమైనా  ఇది జగన్ కి ఎప్పటికైనా ప్రమాదమే. ఈ అసంతృప్తి నాయకులంతా భవిష్యత్తులో జగన్ ను దెబ్బ కొట్టాలనే చూస్తారు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో కూడా మొదట్లో ఇలాంటి అసంతృప్తి నాయకుల రోదనలను ఎన్టీఆర్ పెద్దగా పట్టించుకోలేదు. దాంతో చివరికీ అలాంటి నాయకుల చేతిలోనే  ఎన్టీఆర్ వెన్నుపోటు పొడిపించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు జగన్ కూడా అలాంటి రాజకీయ ప్రమాదంలోనే ఉన్నాడు.  ఇప్పటికైనా జగన్  ఆ అసంతృప్తి నాయకులను  బుజ్జగించే ప్రయత్నం చేసి.. తన పై అసలు అసంతృప్తిని పెంచుకునే నాయకులనే  లేకుండా చేసుకోవడం మంచింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: