తెలంగాణ సీఎం కేసీఆర్ కు కష్టకాలం వచ్చినట్టు కనిపిస్తోంది. తమతమ నెలవులు తప్పిన మిత్రులే శత్రువులౌదురు తథ్యము సుమతీ.. అన్న పద్యం ఇప్పుడు గుర్తొస్తోంది. ఇన్నాళ్లూ కేసీఆర్ నెత్తిన పెట్టుకున్న పెద్దమనిషి ఇప్పుడు ఆయనకు గట్టి షాకులే ఇస్తున్నారు.


తెలంగాణ సీఎం కేసీఆర్ గవర్నర్ నరసింహన్ ను ఎంతగా గౌరవిస్తారో తెలియంది కాదు. రాష్ట్రంలో ఎలాంటి కీలక నిర్ణయం తీసుకునే ముందైనా గవర్నర్ ను కలుస్తారు. ప్రతి ముఖ్యమైన విషయం గవర్నర్ కు చెబుతారు.


పండుగలు పబ్బాలప్పుడు స్వయంగా వెళ్లి శుభాకాంక్షలు చెబుతారు. కేసీఆర్ అంతగా ఆయనకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. గవర్నర్ కూడా అంతే ప్రేమగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఎందుకో సీన్ రివర్స్ అయినట్టు కనిపిస్తోంది. ఏపీకి కొత్త గవర్నర్ ను నియమించడం, తెలంగాణలో బీజేపీ పుంజుకునే ప్రయత్నాలు చేయడం నేపథ్యంలో ఏదో తేడాగా అనిపిస్తోంది.


తాజాగా.. ఎన్నడూ లేని విదంగా కేసీఆర్ ప్రభుత్వానికి ఇబ్బంది ఎదురైంది. మున్సిపల్ చట్టంపై గవర్నర్ నరసింహన్ అభ్యంతరం చెప్పారు. ఈ బిల్లు కు అమోదం తెలపకుండా తిప్పి పంపారు. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వానికే పూర్తి స్థాయి అధికారాలు ఉండటం పట్ల నరసింహన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారట. మరి ఇది కేవలం ఈ బిల్లుకే పరిమితమా.. లేక నరసింహన్ వ్యవహారశైలిలోనే మార్పు వచ్చిందా అన్నది కొన్నాళ్లు ఆగితేకానీ చెప్పలేం.


మరింత సమాచారం తెలుసుకోండి: