బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో మెల్లిగా పావులు కడుపుతున్నది.  ఇప్పటికే ఏపీలోనిద్వితీయశ్రేణి, కాంగ్రెస్ పార్టీ నేతలను పార్టీలోకి తీసుకున్న బీజేపీ ఇప్పుడు తెలుగుదేశం ప్రతి నాయకులపై దృష్టి పెట్టింది.  ఆ పార్టీ నుంచి కొంతమంది ఇప్పటికే తీర్ధం పుచ్చుకున్నారు.  


మరికొందరు పార్టీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారు.  టిడిపి ఎమ్మెల్యేలు, ఎంపీలు కొందరు పార్టీ మారే ఆలోచనలో ఉన్నా .. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు.  ఈ ఆషాడం వెళ్ళగానే కొందరు గోడదూకే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.  


ప్రతిపక్షంతో పాటు అధికార పక్షంలోని కొంతమందికి గాలం వేసేందుకు బీజేపీ రెడీ అవుతున్నది.  వైకాపాలో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న  వెల్లంపల్లి శ్రీనివాస్ ను పార్టీలో తీసుకునేందుకు బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది.  స్వతహాగా వెల్లంపల్లి బీజేపీకి చెందిన వ్యక్తే.  


చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో వెల్లంపల్లి మొదటిసారి విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.  అనంతరం ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో.. వెల్లంపల్లి బీజీపీలో జాయిన్ అయ్యారు.  2014 లో బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన తరువాత టిడిపిలో జాయిన్ అయ్యారు.  


2019 టిడిపి నుంచి వైకాపాలో జాయిన్ అయ్యి విజయం సాధించాడు.  ప్రస్తుతం వైకాపాలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు.  కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో వెల్లంపల్లిని పార్టీలోకి తీసుకోవాలని చూస్తోంది.  ఒకవేళ పార్టీలోకి వస్తే.. కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారట.  మరి వెల్లంపల్లి దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: