తెలుగుదేశం పార్టీ కి మరొక చిక్కు వచ్చి పడింది . శాసనసభా  సంప్రదాయం ప్రకారం ప్రధాన ప్రతిపక్ష పార్టీ కి చెందిన సభ్యులకు లభించే ఏకైక పదవీ  ప్రజాపద్దుల కమిటీ (పీ ఏ సి )  చైర్మన్ . ఈ పదవీకి  ఎవరి పేరు ఖరారు చేయాలన్న దానిపై టీడీపీ  నాయకత్వం తర్జన, భర్జనలు పడుతున్నట్లు తెలుస్తోంది . పీ ఏ సి చైర్మన్ పదవీ కేబినెట్ హోదా కలిగి ఉండడం తో, టీడీపీకి చెందిన పలువురు సీనియర్లు ఈ పదవీ ని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది . ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది . ఇప్పటికే పార్టీకి చెందిన పలువురు సీనియర్లు బీజేపీ గూటికి చేరారు .


 ఈ తరుణం లో పీ ఏ సి చైర్మన్ పదవీని ఆశిస్తున్న సీనియర్లకు ఎలా నచ్చచెప్పాలో తెలియక పార్టీ నాయకత్వం తలలు పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది . ఎందుకంటే ఇదే సాకుతో ఎవరైనా ఎమ్మెల్యేలు ఎక్కడ చేజారుతోనని  టీడీపీ నాయకత్వం లోలోపల గుబులుపడుతున్నట్లు సమాచారం . పీ ఏ సి చైర్మన్ పదవీ ని ఆశిస్తున్న వారిలో పార్టీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి , అచ్చెన్నాయుడు , గంటా శ్రీనివాసరావు తోపాటు ఇంకా పలువురు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది . ఎందుకంటే మరో ఐదేళ్ల వరకు టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రభుత్వ పదవులు లభించే అవకాశం లేదు .


 దాంతో ఎలాగైనా పీ ఏ సి చైర్మన్ పదవీని దక్కించుకోవాలని వారు  ఆరాటపడుతున్నారు . గోరంట్ల గత టీడీపీ ప్రభుత్వ హయాం లో మంత్రి పదవి ఆశించారు . కానీ ఆయనకు మంత్రి పదవీ దక్కలేదు . ఇక అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావులు గత ప్రభుత్వ హయాం లో మంత్రులు గా పనిచేశారు . దాంతో అందరికంటే సీనియర్ అయిన బుచ్చయ్య వైపే టీడీపీ అధినేత చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది


మరింత సమాచారం తెలుసుకోండి: