అధికార పార్టీ నేతలు సహనం ఉండాలి.. విపక్షాల విమర్శలను స్వీకరించే ఓపిక ఉండాలి. విమర్శలను తిప్పికొట్టే నేర్పు ఉండాలి.. విమర్శలకు సమాధానం చెప్పే నాలెడ్జ్ ఉండాలి. కానీ ఇవేవీ పట్టించుకోకుండా మంద బలం ఉంది కదా అని రెచ్చిపోవడం కొన్నిసార్లు చేటు తెస్తుంది.


ఇప్పుడు వైసీపీ విషయంలో అదే జరుగుతోంది. కొందరు నేతలు తమ సంఖ్యాబలం చూసి రెచ్చిపోతున్నారు. జగన్ కు తలనొప్పులు తెస్తున్నారు. అలాంటి వారిలో నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకరు.


ఇప్పటికే ఆయన ఓ జర్నలిస్టును నరికిపారేస్తా అంటూ చేసిన బెదిరింపులు వైసీపీ పరువు తీశాయి. మీడియాలో హల్ చల్ గా మారాయి. ఇప్పుడు తాజాగా ఆయన నిండు అసెంబ్లీలో చంద్రబాబును ఖబడ్దార్ అంటూ చేసిన ప్రసంగం అభ్యంతరకరంగా లేకపోయినా అహంకారపూరితంగా ఉంది.


ఖబడ్డార్, చంద్రబాబునాయుడూ అంటూ రెచ్చిపోయిన శ్రీధర్ రెడ్డి, ‘మీ ఎమ్మెల్యేలను అదుపులో పెట్టుకో’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న తమకు శాసన సభా సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎంత వేడుకున్నా మాట్లాడే అవకాశం దక్కేది కాదనీ, బతిమలాడుకోవాల్సిన దుస్థితి ఉండేదని అన్నారు.


అది నిజమే కావచ్చు.. కానీ ఇప్పుడు వైసీపీ కూడా అదేలా ప్రవర్తిస్తే ఇక తేడా ఏముంటుంది.. సభను హుందాగా నడిపిస్తామన్న స్పీకర్ మాటలకు విలువేముంటుంది..?


మరింత సమాచారం తెలుసుకోండి: