ముదిమి వయసులో మరో సారి రాజ్య లక్ష్మి  వరిస్తోంది. చిరకాల వాంచ తీరే తరుణం వచ్చేసింది. సరిగ్గా పదమూడు నెలల క్రిత్రం అనేకమైన నాటకీయ పరిణామాల మధ్య జారిపోయిన ముఖ్యమంత్రి పదవి ఇపుడు దక్కబోతోంది. దేశంలోనే సంపన్న రాష్ట్రంగా పేరున్న కర్నాటకు రాజు అంటే అది చాలా గొప్ప విషయం.


యడ్యూరప్ప కర్నాటక కొత్త సీఎం కాబోతున్నారు.  జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ప్రస్తుతం బీజేపీకి 105 మంది సభ్యులున్న విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా యడ్యూరప్ప గవర్నర్‌ను కోరే అవకాశం ఉంది. 


కాగా అసెంబ్లీలో బలపరీక్ష అనంతరం సభలోనే బీజేపీ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ.. తర్వాతి ప్రభుత్వం తమదేనని సంకేతమినిచ్చారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. యడ్యూరప్ప మరోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. అంతకు ముందు కుమారస్వామి సర్కార్ విశ్వాస పరీక్షను అందుకోలేక కుప్పకూలింది.  కుమార ప్రభుత్వానికి  అనుకూలంగా 99 ఓట్లు వస్తే వ్యతిరేకంగా 105 ఓట్లు వచ్చాయి. దీంతో కుమారస్వామి రాజీనామా చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: