ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలిలో మాజీ మంత్రి నారా లోకేష్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ల మధ్య మాటల యుద్ధం తారా స్థాయి కి చేరుకుంది. అధికార పక్షం ఆరోపిస్తున్నట్లు తన సొంత కంపెనీ కి ప్రభుత్వం నిధులు మళ్లించారని ఆరోపణలు చేస్తున్నారు కదా సాక్ష్యాధారాలు ఉన్నాయ ని లోకేష్ అధికార పక్ష నేత మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను ప్రశ్నించారు.


దీనికి బదులు గా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఘాటు గానే స్పందించారు రాష్ట్రం లో ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ లు ఎన్నో ఉన్నాయని తెలుగు కోచింగ్ సెంటర్ లు పెడితే బాగుండేదని. ఇక్కడ మంగళగిరి మందళగిరి అని జయంతి ని వర్థంతి అన్న నారా లోకేష్ గత ప్రభుత్వంలో మంత్రి గా పని చేశారని విమర్శించారు. కనీసం మాతృ భాష తెలుగు కూడా మాట్లాడటం చేతగాని మీరా మాకు నీతులు చెబుతున్నారంటూ విరుచుకపడ్డారు.


మాజీ మంత్రి నారా లోకేష్ కు మాతృభాష లో ట్రైనింగ్ ఇప్పించాల్సిన అవసరం ఉందని సూచించారు ఏనాడైనా ఒంటరి గా పోటీ లో దిగారా ఎప్పుడు పొత్తు బతికే మీదే అని విమర్శించారు. ఒంటరి గా పోరులో కి దిగి నూట యాభై సీట్లు గెలుచుకున్న మా నాయకుడు జగన్ సీఎం అయ్యారని అదీ గొప్ప అది మీ వల్ల అవుతుందా అని ప్రశ్నించారు అనిల్ కుమార్ యాదవ్. గతంలో ఇరవై మూడు మంది వైసీపీ ఎమ్మెల్యే లను కొనుగో లు చేసి ఇప్పుడు నీతికబుర్లు చెబుతున్నారని విరుచుకుపడ్డారు.


కాగా ఈనేపధ్యం లో నారా లోకేష్ పై ఓ రేంజ్ లో మండిపడుతూ విమర్శ లు గుప్పిస్తున్న మంత్రి అనిల్ కుమార్ వ్యవహార శైలిపై స్పందించిన తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గతంలో పదహారు నెలలు జైలు శిక్ష అనుభవించిన నాటి ఫొటోలు జగన్ పై అప్పుడు వచ్చిన వార్త లను సేకరించి కొరియర్ ద్వారా అనిల్ కుమార్ యాదవ్ కు పంపిస్తూ సహజంగా కొంత మంది కొన్ని పొరపాట్లు చేస్తుంటారు అలాగే నారా లోకేష్ గారు పొరపాటున మాట జారిన విషయాన్ని పట్టుకొని ప్రతి అంశానికి ఆ పొరపాటు ను జోడించి మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎందుకంటే గతంలో ఆర్థిక నేరాల కు పాల్పడ్డాడు అన్న ఆరోపణ లతో పదహారు నెలలు జైలు శిక్ష అనుభవించిన జగన్ గారిని దొంగా దొంగా అని పదేపదే అంటే మీకు ఎంత కోపం వస్తుందో, ప్రతిసారి నారా లోకేష్ ను విమర్శిస్తే ఇవతల వారికి కూడా అంతే ఆగ్రహం కలుగుతోందని ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాలి తప్పితే పరస్పరం విమర్శ ప్రతి విమర్శ లు చేసుకోవడం సభా మర్యాద కాదని రామ్మోహన్ నాయుడు అనిల్ కుమార్ ను ఉద్దేశించి మాట్లాడారు.


మరోవైపు ఇటీవల కాలంలో అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యల పై రాష్ట్ర అభివృద్ధి పై కాకుండా వ్యక్తిగత దూషణల పైనే చర్చలు జరుగుతున్నాయని ముఖ్యం గా అసెంబ్లీ లో మంత్రి అనిల్ కుమార్ హావభావాలు విమర్శించే నైజం తాలూకు భాష కూడా కాస్త ఇబ్బంది గా ఉన్నట్టు సామాన్య ప్రజలు సైతం కూడా అభిప్రాయపడుతుండటం తో ఈ విషయాన్ని గమనించిన ముఖ్య మంత్రి వైఎస్ జగన్ ఇక మీదట అసెంబ్లీ లో వ్యక్తిగత విషయాలు మాట్లాడకుండా కేవలం ప్రజా సమస్యల పై వారి పరిష్కారాలపైనే స్పందించాల్సింది గా మంత్రి అనిల్ కుమార్ కు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: