ఏపీకి కొత్త గవర్నర్ వచ్చేశారు.  వస్తూనే తిరుమల స్వామి వారు, విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులు తీసుకున్న ఏపీ  తొలి పౌరుడుకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘన స్వాగతం లభించింది. [పొరుగున ఉన్న ఒడిషాకి చెందిన సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు, బీజేపీ వరిష్ట నేత అయిన విశ్వభూషణ్  హరిచందన్ నవ్యాంధ్రకు తొలి గవర్నర్ గా చరిత్రకు ఎక్కారు.  ఆయన్ని గత వారం రాష్ట్రపతి నియమించారు.


ఇదిలా ఉండగా  నూతన గవర్నర్‌గా విశ్వభూషన్‌ ఈ రోజు  ఉదయం 11.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ విశ్వభూషణ్‌తో గవర్నర్‌గా ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, ప్రత్యేక ఆహ్వానితులు హాజరుకానున్నారు.


ప్రమాణ స్వీకారం అనంతరం అతిథులకు రాజ్‌భవన్‌ అధికారులు తేనీటి విందు ఏర్పాటు చేశారు. విజయవాడలోని ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయంలో రాజ్‌భవన్‌ ఏర్పాటు పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. కొత్త గవర్నర్, కొత్త ముఖ్యమంత్రి, కొత్త రాష్ట్రం, ఇక ఏపీలో పాలన కొత్త పుంతలు తొక్కుతుందని ఆంధ్రులంతా ఆకాంక్షిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: