జగన్‌ ప్రభుత్వానికి తప్పిన అప్పు ముప్పు !!
అదొక వడ్డీ వ్యాపార కంపెనీ, అంతకన్నా పెట్టుబడిదారులకు మూకుమ్మడి సంస్ధ. అప్పులిచ్చి వడ్డీలు తీసుకుంటారు, అంతకన్నా ముఖ్యంగా వడ్డీలిచ్చిన రాష్ట్రాల్ని, వ్యవస్తల్ని గుప్పిటపెట్టుకుని మల్టీనేషన్‌ కంపెనీలకు అప్పగిస్తారు. అదే ప్రపంచబ్యాంకు తీరు. ఈ సామ్రాజ్యవాదాన్ని, వ్యతిరేకించింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. గత ప్రభుత్వం విలాసాలతో,విదేశీ పర్యటనలు కోసం, విచ్చల విడిగా ఖర్చు చేసిన తీరు కథనాలను జాతీయ ఛానెల్స్‌లో చూసిన కేంద్రం, ఇప్పటికే అప్పుల పాలైన ఆంధ్రప్రదేశ్‌ మరింత అప్పుల ఊబిలో కూరుకు పోకుండా ఆపింది.

అవతవకల అమరావతి నిర్మాణానికి అలా ప్రపంచ బ్యాంకు అప్పు ఆగి పోయింది. ఈ నేపథ్యంలో, అమరావతి ప్రాజెక్టుకు రుణమివ్వరాదన్న ప్రపంచ బ్యాంకు నిర్ణయం బాటలోనే, ఏసియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్టమెంట్‌ బ్యాంక్‌ కూడా నడిచింది. అమరావతికి రూ.1360 కోట్ల మేర రుణం మంజూరు చేయాలంటూ, గత ప్రభుత్వంలోని, ఏపీసీఆర్డీయే చేసిన అభ్యర్థనను పరిశీలించిన ఏఐఐబీ, ఇప్పుడు వెనుకడుగు వేసింది. రాజధాని నిర్మాణానికి రుణం ఇవ్వబోవడం లేదని మంగళవారం తేల్చేసింది.

 '' ఇదంతా జగన్‌ ప్రభుత్వానికి జరిగిన గొప్ప మేలు. ఎందుకంటే, ఈ ప్రభుత్వం అమరావతికి అప్పు కావాలని, ప్రపంచ సంస్ధలను అడగ లేదు కాబట్టి , వారు ఇవ్వక పోతే జగన్‌ ప్రభుత్వానికి వచ్చిన నష్టం లేదు... అమరావతి నిర్మాణానికి రమారమి లక్ష కోట్లు అవసరమని గత ప్రభుత్వం అంచనా వేసింది. ఇందుకయ్యే వ్యయంలో ఎక్కువ మొత్తాన్ని కేటాయించాలని కేంద్రాన్ని అభ్యర్థించింది. అమరావతికి కేంద్రం విదిల్చింది అరకొరే!' అని పరిశీలకులంటున్నారు.

  స్వయానా జగన్‌ ప్రభుత్వమే అమరావతిలో నిర్మాణాలు అక్రమాలమయమని, ఆరోపిస్తూ, వాటి నిగ్గు తేల్చేందుకు ఉన్నతస్థాయి కమిటీలను సైతం ఏర్పాటు చేయడం కూడా, అప్పులివ్వాలనుకున్న వారు వెనకడుగు వేయడానికి కారణం కావచ్చు.

'అప్పుతీసుకున్నవాడు తిరిగి తీర్చలేకపోవడమే వాడికి కావలిసింది, అప్పుడేగా ఇంటి మొత్తాన్ని స్వాధీనం చేసుకోవచ్చు! అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి ఇలా అప్పులు రాకపోవడం ఒక శుభపరిణామం' అంటున్నారు సోషల్‌ మీడియాలో నెటిజన్లు .


మరింత సమాచారం తెలుసుకోండి: