2009 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ను ప్రచారానికి వాడుకుంది.  ప్రచారం కోసం ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల్లో తిరుగారు.  ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఉన్నది కాబట్టి తెలుగుదేశం ఓటమిపాలైంది.  కానీ, ఎన్టీఆర్ ప్రచారానికి మంచి హైప్ వచ్చింది.  పెద్ద ఎన్టీఆర్ లానే ఉన్నారని ప్రశంసించారు.  


భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని లీడ్ చేస్తారని వార్తలు వచ్చాయి.  ఎన్నికల తరువాత ఎన్టీఆర్ ను బాబు పక్కన పెట్టారు.  పార్టీకి దూరంగా ఉంచారు.  హరికృష్ణను కూడా దూరంగా ఉంచడంతో ఎన్టీఆర్ ఆ పార్టీకి దూరం అయ్యాడు.  ఇప్పటికి దూరంగానే ఉన్నాడు.  


రాష్ట్రం విభజన జరిగింది.  2019 ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తరువాత అనేక పధకాలు ప్రవేశపెట్టింది.  ఎన్నో హామీలు ఇచ్చింది.  అందులో ఒకటి మద్యపాన నిషేధం.  దీన్ని అమలు చేయాలంటే మాములు విషయం కాదు.  రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే వాటిల్లో ఇదొకటి.  కానీ మద్యపాన నిషేధం అమలు చేసి తీరుతామని అంటోంది వైకాపా.  


మద్యపాన నిషేధం అమలు చేయడానికి దానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ ను నియమించాలని అనుకుంటోంది.  దీనికోసం ఎన్టీఆర్ ను తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.  ఎన్టీఆర్ తో సంప్రదింపులు జరుపుతున్నారట.  ఒకవేళ ఎన్టీఆర్ ఒకే అంటే వైకాపాలో పదవి లభించినట్టే.  మద్యపాన నిషేధం అన్నది మంచిపనే కాబట్టి దానికి ఎన్టీఆర్ ఒప్పుకుంటారని అనుకుంటున్నారు.  చూద్దాం. 


మరింత సమాచారం తెలుసుకోండి: