ఇండియాలో ఇప్పుడు ట్రంప్ మాట్లాడిన చిన్న మాట చిన్న సునామీనే రేపుతోంది. అయితే కశ్మీర్ సమస్య పరిష్కారానికి తాము కృషి చేస్తామంటూ ఇదివరకూ ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు పిలుపునిచ్చారు. అయితే కశ్మీర్ తమ దేశంలో అంతర్భాగం, అక్కడ సమస్య వస్తే పరాయి దేశం వాళ్లు వచ్చి పరిష్కరిస్తామనడం ఏమిటి? అంటూ ఇండియా ప్రశ్నిస్తోంది. దేశంలో అధికారం ఎవరి చేతిలో ఉన్నా పరిస్థితి అయితే అలానే కొనసాగుతూ ఉంది. మరొకరి జోక్యాన్ని ఇండియా ఎప్పుడూ అడగలేదు, ఆశించలేదు.


ఎవరైనా ముందుకు వచ్చినా వారిని వారిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో కశ్మీర్ సమస్య పరిష్కారానికి తను మధ్య వర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడనే వార్త సంచలనంగా మారింది. అమెరికా వెళ్లిన ఇమ్రాన్ ఖాన్ తో ఈ మాట అన్నాడట. ఆయన అనడం విడ్డూరం కాదు, మధ్యవర్తిత్వానికి మోడీనే తనను కోరాడని ట్రంప్ అన్నాడట. ఇక్కడే అసలు రగడ మొదలవుతోంది.


కశ్మీర్ విషయంలో భారత వైఖరికి వ్యతిరేకంగా మోడీ వెళ్లి ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని ఎందుకు కోరారు? అనేది ప్రశ్న. ఈ అంశంపై కేంద్రం స్పందించింది. కశ్మీర్ పై ఎవరి మధ్యవర్తిత్వాన్నీ తాము కోరలేదు, ట్రంప్ ను మోడీ అస్సలు కోరలేదు అని కేంద్రం స్పందిస్తోంది. అయితే మోడీ తనను కోరాడంటూ ప్రకటన చేసింది సాక్షాత్ అమెరికా అధ్యక్షుడు! మరి ఇందులో నిజం ఎవరు చెబుతున్నారు? అబద్ధం ఎవరు చెబుతున్నట్టు? 

మరింత సమాచారం తెలుసుకోండి: