జగన్మోహన్ రెడ్డి నిజంగానే డేరింగ్ స్టెప్ వేశారు. శాస్వత ప్రాతిపదికన బిసి కమీషన్ వేయటమంటే మామూలు విషయం కాదు. ఎప్పుడో అవసరమైనపుడు మాత్రమే గత ప్రభుత్వాలు బిసి కమీషన్ వేసేవి. మొన్న కాపులను బిసిల్లో చేరుస్తానని దొంగ హామీలిచ్చి అధ్యయనం కోసం చంద్రబాబు మంజూనాధ కమీషన్ వేసినట్లు.

 

కానీ జగన్ అలా చేయలేదు. ఏకంగా శాస్వత కమీషన్నే వేసేశారు. అంటే బిసిలకు సంబంధించిన ప్రతీ అంశాన్ని ఈ కమీషనే టేకప్ చేస్తుంది. దేశవ్యాప్తంగా కూడా ఎన్ని రాష్ట్రాల్లో శాస్వత ప్రాతిపదికన బిసి కమీషన్ ఉందో తెలీదు. తెలంగాణాలో మాత్రం ఉంది. ఏపిలో నియమించినట్లే శాస్వత కమీషన్ లేని రాష్ట్రాల్లో కూడా డామాండ్లు మొదలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయనే చెప్పాలి.

 

గతంలో ఎప్పుడో మురళీధరరావు కమీషన్ తర్వాత పుట్టుస్వామి కమీషన్లు వేసినా అవసరానికి మాత్రమే వేశారు. కానీ జగన్ మాత్రం శాస్వత కమీషన్ వేయటం నిజంగా డేరింగ్ స్టెప్ అనే చెప్పాలి. బిసి వర్గాలకు ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన నిధులు సక్రమంగా ఖర్చు అవుతున్నది లేంది ఈ కమీషనే చూడవచ్చు.

 

అలాగే బిసిల స్ధితిగతులపై కమీషన్ ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి ప్రభుత్వానికి రిపోర్టు ఇస్తుంది. జనాభా గణన అంశాన్ని కూడా ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసేందుకు కూడా కమీషన్ ఉపయోగపడుతుంది. ఎలాగూ రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోనే కమీషన్ పనిచేస్తుంది కాబట్టి న్యాయపరమైన వివాదాలు కూడా ఉండవనే చెప్పాలి. మూడుసార్లు  ముఖ్యమంత్రిగా పనిచేశానని, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు కూడా చేయలేని పనిని జగన్ చేయటం నిజంగా డేరింగ్ డెసిషనే.


మరింత సమాచారం తెలుసుకోండి: