ఏపీలో జగన్ సర్కార్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది కనిపిస్తుంది. రాజధాని అమరావతి కి ఋణం ఆపేసిన  ప్రపంచ బ్యాంక్ బాటలోనే  తాము కూడా అప్పు ఇవ్వడం లేదనే ఏషియన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వె్ స్టమెంట్ బ్యాంక్ స్పష్టం చేసింది.  ఏఐఐబీ చైనా ఆర్థిక సాయంతో నడిచే సంస్థ. ప్రపంచ బ్యాంకు లతో కలిసి రాజధానికి అప్పు ఇచ్చే విషయాన్ని గత కొంత కాలంగా ఇది కూడా చాలా చురుగ్గా పరిశీలించింది.

ఇటీవల అమరావతికి ప్రపంచ బ్యాంకు ఋణాలూ ఇవ్వబోమని తేల్చి చెప్పడం చూసి ఇప్పుడు ఈ సంస్థ కూడా రుణాలనూ ఆపేయాలనుకుంటోంది.  ప్రపంచ బ్యాంక్ నిర్ణయం తో రెండు వేల కోట్లు వచ్చే అవకాశం చేజారిపోయింది ఏఐఐబి రుణాలివ్వడం నిరాకరించటం మార్క్ 1360 కోట్లు మేర నిధులు ఆగిపోయాయి. 

ఋణాలు నిరాకరించడం అమరావతి నిర్మాణం సందిగ్ధం లో పడేసింది.  కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎటువంటి సహాయం అమరావతి కోసం చేయలేదు. అమరావతి కి కొత్త గా ఏర్పడిన ప్రభుత్వం కూడా అంతా ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనపడటం లేదు. అమరావతి నిర్మానానికి  దాదాపు గా లక్ష కోట్లు అవసరమని గత ప్రభుత్వం అంచనా వేసింది.

దాదాపు ఐదేళ్ల పాటు దీనికోసం కేంద్రాన్ని అభ్యర్థించింది కానీ కేంద్రం ఏనాడూ పట్టించుకోకపోయినా చంద్రబాబు రాజధాని నిర్మాణా లకు సవాల్ గా తీసుకున్నారు.  కేంద్రం సహాయం కోరుతూనే  వివిధ మార్గాల్లో నిధుల సమీకరణకూ ప్రయత్నం చేసేవారు. ఇప్పుడు దాని నిర్మానం ఏమవుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: