జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల హామీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించడంతో ఏపీ పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేలా అసెంబ్లీలో బిల్లు పెట్టి బిల్లు పాస్ చేయించారు జగన్మోహన్ రెడ్డి గారు. సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం అన్ని పార్టీలకు షాక్ ఇస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ జగన్ నిర్ణయం ఫెడరల్ స్పూర్తికి విరుధ్ధమంటూ వ్యాఖ్యలు చేసింది. 
 
కానీ ఆంధ్రప్రదేశ్ యువత మాత్రం ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూర్, చెన్నై, హైదరాబాద్, పూణె లాంటి నగరాలతో పోలిస్తే ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి ఎంతో అభివృధ్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల్లో కూడా ఇతర రాష్ట్రాల వారికే ఉద్యోగాలు ఇస్తే స్థానిక యువతకు ఉద్యోగాలు దొరకటం కష్టమవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించడంతో రాష్ట్రంలోని పరిశ్రమలన్నీ తప్పనిసరిగా 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వబోతున్నాయి. 
 
అనంతపూర్ జిల్లాలోని కియా పరిశ్రమలో స్థానికుల కంటే తమిళులకే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కియా లాంటి పరిశ్రమలు సైతం జగన్ నిర్ణయం వలన స్థానికులకే ఉద్యోగాలు ఇస్తాయి. జగన్ తీసుకున్న నిర్ణయంపై జాతీయ మీడియాలో కూడా కథనాలు వస్తూ ఉండటం విశేషం. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణం చేసిన రెండు నెలల్లోనే నిరుద్యోగ యువత కోసం తీసుకుంటున్న నిర్ణయాలపై నిరుద్యోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: