రోజు రోజుకు కొత్త శిఖరాలను అధిరోహిస్తారు బ్యాంకుల యొక్క మొండి బాకీలు లేదా నిరర్ధక ఆస్తుల యొక్క నేటి విలువ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించిన లెక్కల ప్రకారం తొమ్మిది లక్షల 60000 కోట్లు మాత్రమే . ఈ లెక్క అనధికారికంగా 13 లక్షల కోట్లు మించవచ్చు అనేది అత్యంత విశ్వశనీయమైన సమాచారం.


ఈ మొండి బాకీలు ఈ విధంగా పెరగడానికి గల కారణాలను విశ్లేషిస్తే తప్పుడు పద్ధతుల ద్వారా రుణాలు మంజూరు చేయడం దానిద్వారా ప్రైవేటు కార్పొరేట్ రంగానికి మేలు చేకూర్చడం కారణాలుగా భావించవచ్చు. కార్పొరేట్ రంగానికి మంజూరు చేసిన లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం రాని బాకీలు గా, మొండి బాకీలు గా, నిరర్ధక ఆస్తులుగా మిగిలిపోయి ఈరోజు మనదేశంలో చాలా బ్యాంకులు పతనం అవ్వడానికి దారి తీసిన పరిస్థితులు ఉన్నాయి.


ఈ మొండి బాకీలు ఈ రకంగా పేరుకుపోవడానికి మరో కారణం 2008 - 2014 మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వం గాని ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించడమే. కానీ ఈ మొండి బకాయిలను పునర్వ్యవస్థీకరించడం ద్వారా కార్పొరేట్ రంగానికి లాభాన్ని చేకూర్చాలని దారుణమైన తలంపు వల్ల ఈ నిరర్ధక ఆస్తులు అనే విపత్తు నేడు బ్యాంకింగ్ రంగం ఎదుర్కొన వలసి వస్తున్నది.


ఉద్దేశపూర్వకంగా బ్యాంకు రుణాలను ఎగవేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవలసిన ప్రభుత్వం బ్యాంకింగ్ రంగానికి తీరని నష్టం జరిగే రుణ పునర్వ్యవస్థీకరణ వంటి దిద్దుబాటు చర్యలకు పూనుకోవడం అత్యంత శోచనీయం. ఇటువంటి ఆ శాస్త్రీయ పద్ధతుల ను అవలంబించడం ద్వారా బ్యాంకులకు క్షవరం జరిగిందనేది పచ్చి నిజం. దీనిని బట్టి ఈ నిరర్ధక ఆస్తుల విపత్తు నుంచి బ్యాంకుల రక్షించ డంలో ప్రభుత్వం మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దారుణంగా విఫలమయ్యాయని చెప్పవచ్చు


మరింత సమాచారం తెలుసుకోండి: