ఏపీ అసెంబ్లీలో నిజానికి అధికార పార్టీ బలమే అంతా కనిపిస్తుంది. ఎటు చూసినా వైసీపీ ఎమ్మెల్యేలతోనే సభ నిండిపోతుంది. అదే సమయంలో ఏడవ వంతు కూడ సంఖ్యాబలం లేని విపక్షంగా  టీడీపీ ఉంది. అయితే ఇక్కడ చెప్పుకోవాలసింది ఏంటంటే  టీడీపీకి అనుభవం చాలా  ఉంది. దేన్ని అయినా ట్విస్ట్ చేసి మాట్లాడే వారు ఆ పార్టీలో   ఉన్నారు.


అదే ఆ పార్టీ అసలైన బలం. కేవలం 23 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అడుగుపెట్టిన చంద్రబాబుకు మాట సాయం చేస్తున్న వారు ఆ ముగ్గురే. ఇప్పటికి జరిగిన సమావేశాలు చూస్తే అచ్చెన్నాయుడు, రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి టీడీపీ తరఫున తన గొంతును గట్టిగా వినిపిస్తున్నారు. దాంతో బాబు కీలకమైన సమయాల్లో మాత్రమే మాట్లాడుతున్నారు. తన వ్యూహాన్ని వారి ద్వారా అమలు చేయిస్తున్నారు. 


ఇపుడు ఆ ముగ్గురిని ఈ సమావేశాలు ముగిసేదాకా సస్పెండ్ చేయడంతో టీడీపీ గొంతు మూగబోయినట్లైంది. మరీ ముఖ్యంగా బాబుకు మాట సాయం చేసే వారే అసెంబ్లీలో లేని పరిస్థితి. పేరుకు మిగిలిన ఎమ్మెల్యేలు ఉన్నా  వివిధ కారణాలతో వారు పెద్దగా గొంతు విప్పడంలేదు. దాంతో మిగిలిన రోజులన్నీ టీడీపీ వాకౌట్లతో సరిపెట్టాలని చూస్తోందట. మొత్తానికి వ్యూహాత్మకంగానే చంద్రబాబుకు జగన్ షాక్ ఇచ్చారనిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: