చంద్రబాబునాయుడుకు ఎల్లో మీడియాకు ఉన్న సంబంధాలేంటో అందరికీ తెలుసు. చంద్రబాబుకు ఇబ్బందులు తప్పవు అన్నపుడల్లా ఎంత ఓవర్ యాక్షన్ చేయాలో అంతా చేస్తాయి. ఇపుడు జరుగుతున్నది అదే. చంద్రబాబు హయాంలో విద్యుత్ కొనుగోళ్ళకు కుదుర్చుకున్న పిపిఏలను సమీక్షించటం, రాజధాని అవినీతిని ఆరాతీయటం, పోలవరం అవినీతిపై కమిటి వేయటమే జగన్ చేసిన మహాపాపం అయిపోయింది.

 

ఎల్లో మీడియాలో  ఒకటి ఈరోజు వండి వార్చిన ప్రత్యేక కథనాలు అలాగే ఉన్నాయి. కాకపోతే తమ అభిప్రాయాలుగా చెప్పకుండా అంతర్జాతీయ రేటింగ్ సంస్ధ క్రిసిల్ చెప్పిందని, ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాక్ (ఏఐఐబి) అభ్యంతరాలు చెప్పిందని రాగాలు తీస్తోంది. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై జగన్ సమీక్షలు చేయకూడదన్నట్లుగా పై సంస్ధలు అభ్యంతరాలు చెప్పాయన్నట్లుగా తోక పత్రిక చెబుతోంది.

 

అంటే విద్యుత్ ఉత్పత్తి సంస్ధలతో చేసుకున్న పిపిఏల్లో అవినీతి జరిగినా జగన్ పట్టించుకోకూడదు. పోలవరం నిర్మాణంలో భారీ అవినీతి జరిగినా చూసి చూడనట్లు వదిలేయాలి. రాజధాని నిర్మాణంలో చంద్రబాబు ఎంతస్ధాయిలో అవినీతికి పాల్పడినా పట్టించుకోకూడదన్నట్లే ఉంది తోకపత్రిక వాదన. జగన్ సమీక్షలు చేస్తున్నారు కాబట్టి విద్యుత్ ఉత్పత్తి సంస్ధలకు ఇబ్బందులు మొదలైనాయట.

 

అలాగే రాజధాని నిర్మాణం విషయంలో జగన్ వైఖరి నచ్చలేదు కాబట్టి ప్రపంచబ్యాంకు, ఏఐఐబి అప్పు ఇచ్చేది లేదని చెప్పాయట. అంటే తోకపత్రిక చెప్పేదెలాగుందంటే చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిని జగన్ పట్టించుకోకూడదని చెబుతున్నట్లే ఉంది.  అవినీతి జరిగిందా లేదా అన్నది చంద్రబాబు-జగన్ తేల్చుకుంటారు. మధ్యలో తోక పత్రికకు ఎందుకింత ఆందోళన ?

 


మరింత సమాచారం తెలుసుకోండి: