తెలుగు దేశం పార్టీకి మరోక షాక్ తగిలింది. పి .గన్నవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి టీడీపీకి గుడ్ బై చెప్పారు. తానుపార్టీకి రాజీనామ చేసి బీజేపీలో చేరుతున్నట్లు వెల్లడించారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వారణాసి రామ్ మాధవ్ సమక్షంలో చేరనున్నట్టు స్పష్టం చేసారు. 

ఇటీవల తెలుగుదేశం పార్టీలో చోటుచేసుకున్న పరిస్థితులకు విసుగుచెంది తాను పార్టీ  మారుతున్నట్లు తెలిపారు. బుధవారం పోతవరం గ్రామంలోని కార్యాలయం వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి తన అనుచరగణంతో  భారతీయ జనతా పార్టీ  లో చేరుతున్నట్లు ఆయన తెలియజేశారు.తాను 1982 లో తెలుగు దేశం పార్టీ లో చేరానని, 1996 లో జరిగిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తనకు టికెట్ కేటాయించిందని పులపర్తి అన్నారు. 

జరిగిన ఎన్నికల్లో తాను  విజయం సాధించి తొలి సారి ఎమ్మెల్యేగా పదవి భాద్యతలు స్వీకరించానని తెలిపారు. అప్పటి నుంచీ తెలుగుదేశం పార్టీ కి సేవలు అందించి 2014 లో ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజలకు సేవలందించానని తెలిపారు. ప్రస్తుతం తెలుగు దేశం పార్టీలో నెలకొన్న పరిస్థితుల కారణంగా తాను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: