వైఎస్ జగన్, రోజా మధ్య అంత సఖ్యత లేదని కొన్నిరోజులుగా వార్తలు వచ్చాయి. మంత్రిపదవి ఇవ్వకపోవడం, ఆ తర్వాత మంచి నామినేటెడ్ పోస్టు ఇవ్వలేదని..ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఇప్పుడు రోజా జగన్ కు థ్యాంక్స్ చెప్పారు.


మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే మహిళలకు చారిత్రాత్మక బిల్లులను తీసుకొచ్చినందుకు జగన్‌ మోహన్‌ రెడ్డికి ఎమ్మెల్యే రోజా కృతజ్ఞతలు తెలిపారు. నామినేటెడ్‌ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు ఆమోదించడం, తనకు మొట్ట మొదట ఏపీఐఐసీ చైర్మన్‌ పదవి ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. గత ప్రభుత్వం ఓట్ల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను వాడుకుందని రోజా విమర్శించారు.


మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే విషయంలో ‘ఆకాశంలో సగం, అవనిలో సగం’ అని అనేక సందర్భాల్లో అనేక మంది చెప్పారు గానీ, మహిళలకు అవకాశాలు కల్పించింది జగన్ మాత్రమే అని తాను ఘంటాపథంగా చెబుతానని రోజా అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో సహా మహిళలందరికీ నామినేటెడ్ పదవుల్లోనూ, నామినేషన్ పనుల్లోనూ యాభై శాతం కేటాయించే బిల్లులను ప్రవేశపెట్టడం సంతోషకరమని అన్నారు.


ఇలాంటి చారిత్రాత్మక బిల్లులను ప్రవేశపెట్టడంతో దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారని రోజా అన్నారు. మహిళలకు అవకాశాలిస్తే రాణించగలరన్న నమ్మకంతో ఈ బిల్లులను సీఎం వైయ‌స్ జగన్ తీసుకొచ్చారని, మహిళలందరూ కూడా సంతోషపడే విషయమని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: