తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ ను విభజించినపుడు ఆంధ్రాకు  రాజధాని లేదు. అయితే అప్పటి కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ గా ప్రకటించింది. విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం అధికారాన్ని కైవసం చేసుకుంది. రాజధాని నిర్మాణానికి అన్ని రకాలుగా పరిశోధనలు జరిపి చివరకు అమరావతిని ఆంధ్రుల రాజధానిగా ప్రకటించారు.

మన అమరావతి - మన రాజధాని అంటూ ప్రజలందరినీ తమ వంతు రాజధాని నిర్మాణానికి సహాయం చేయాలంటూ కోరారు. ఒకోక్కరు రూ.10 ఇస్తే దానిని ఒక్క ఇటుకు ఖర్చు చేస్తూ రాజధానిని నిర్మాణం చేపడతానని చెప్పారు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రతి సామాన్యుడు ఇది నా రాజధాని అని అనుకునే విధంగా ప్రయత్నాలు చేసారు. దేశం కాదు, ప్రపంచ గర్వించే రాజధాని మేము కట్టుకుంటున్నాం అంటూ ఎంతో గర్వంగా చెప్పుకునే విధంగా నిర్మాణానికి సంబంధించిన విడియోలను కూడా విడుదల చేశారు. కాని 2019 ఎన్నికల్లో ప్రజలు తీర్పు మాత్రం వేరే విధంగా ప్రకటించారు. రెండోవసారి అధికారాన్ని జగన్ మోహన్ రెడ్డికి అప్పగించారు.

అప్పటి నుంచి అమరావతి పరిస్థితి ఏంటో ఎవరికీ అర్ధం కాలేదు. 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులు, మా పరిస్థితి ఏంటి అంటూ జగన్ వైపు చూడాల్సిన పరిస్థితి. నిత్యం వేల మంది కార్మికులతో హడావిడిగా ఉన్న అమరావతి ప్రాంతం ప్రస్తుతం ఒక్కరు కూడా లేక బోసిపోయింది. ఎక్కడి కట్టడాలు అక్కడే ఆగిపోయాయి. ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వ హాయంలో చాలా అక్రమాలు జరిగాయంటూ చెబుతూ రివర్స్ టెండరింగ్ కు పిలుపునిచ్చింది. దింతో అన్ని కట్టడాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి.

ఎన్నికల ప్రచారంలో కానీ, గెలిచిన అనంతరం కానీ అమరావతి గురించి అసలు మాట్లడలేదు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం అమరావతిని తామే పూర్తి చేస్తాం అంటూ చెబుతున్నరు. అమరావతిపై ప్రాంతం ఇంకా కొంత మందికి ఆశలు ఉన్నాయి. దానికి కారణం, ప్రపంచ బ్యాంక్, మిగతా బ్యాంక్ లు ఇస్తాం అంటున్న లోన్లు. నాలుగు రోజుల క్రిందట ప్రపంచ బ్యాంక్ మేము లోన్ ఇవ్వం అని చెప్పింది. దానికి కారణం కేంద్రం, ఇచ్చిన ప్రతిపాదన వెనక్కు తీసుకోవటం. ఇప్పటి వరకు జరిగిన పనులను పరిశీలించిన తర్వాతే రుణాలు మంజూరు చేస్తామంటూ చెప్పుకొచ్చింది.

ఇప్పుడు తాజగా మరో షాకింగ్ న్యూస్ వచ్చింది. అమరావతి ప్రాజెక్టుకు లోన్ ఇవ్వం అంటూ మరో కీలక బ్యాంకు చెప్పేసింది. అమరావతికి లోన్ ఇవ్వం అంటూ ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్స్ బ్యాంక్(ఏఐఐబీ) అమరావతి స్పష్టం చేసింది. చంద్రబాబు హయంలోనే, అమరావతి నిర్మాణం కోసం 200 మిలియన్ డాలర్లు లోన్ ఇచ్చేందుకు ఏఐఐబీ సుముఖత వ్యక్తం చేసింది. అయితే ప్రభుత్వం మారటంతో, అమరావతి పై జగన్ ప్రభుత్వ వైఖరి చూశాక, ప్రపంచ బ్యాంకే వెనక్కు వెళ్ళిపోతే, మనకు ఎందుకు అంటూ రుణం ఇవ్వకపోవడమే మంచిదని ఏఐఐబీ డైరెక్టర్ల బోర్డు నిర్ణయం తీసుకుంది. రాష్ర్ట బడ్జేట్ లో కూడా నిధులు లేవు. మరోవైపు చూస్తే ప్రపంచ బ్యాంకులు రుణాలు మంజూరు చేయకపోవటం. ఇదంతా చూస్తే ఆంధ్రుల రాజధాని అమరావతిని ప్రస్తుత ప్రభుత్వం ఏలా పూర్తి చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: