ప్రతిపక్షనేత చంద్రబాబును ఇరుకున పెట్టేందుకు ఉన్న అన్ని అవకాశాలను వైఎస్ జగన్ సర్కారు పరిశీలిస్తోంది. చంద్రబాబు హయాంలో జరిగిన తప్పొప్పులను పరిశీలిస్తోంది. అందులో భాగంగానే జగన్ దృష్టికి ఓ పాత కేసు వచ్చింది.


అదే గోదావరి పుష్కర ఘాట్ మరణాల కేసు. ఒకే రోజు దాదాపు పాతిక మంది వరకూ భక్తులు ఆ రోజు తొక్కిసలాటలో మరణించారు. ఈ ఘటనపై చంద్రబాబు హయాంలోనే సోమయాజులు కమిటీని వేసినా.. ఎలాంటి చర్యలు చేపట్టలేదు.


ఇప్పుడు జగన్ సర్కారు కేబినెట్‌ సబ్‌ కమిటీ ద్వారా పుష్కర ఘాట్‌ మ‌ర‌ణాల‌పై విచారణ చేయిస్తామని చెబుతోంది. ఈ మేరకు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఓ ప్రకటన చేశారు. చంద్రబాబు వెళ్లిన పుష్కర ఘాట్‌ వద్ద కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదని సోమయాజులు కమిటీ నివేదిక ఇచ్చిందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు.


సోమయాజులు నివేదికను కూడా చంద్రబాబు ప్రభుత్వం తొక్కిపెట్టిందని మంత్రి వెల్లంపల్లి విమర్శించారు. పుష్కరాల్లో మృతుల కుటుంబాలు చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేశారని తెలిపారు. సామాన్య ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఘాట్‌లోకి చంద్రబాబు వెళ్లడం వల్లే ప్రమాదం జరిగిందని నివేదికలో ఉందన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: