ఏపి అసెంబ్లీ ముందు మాజీ ముఖ్యమంత్రి తెలుగు దేశం అధినేత చంద్రబాబు ధర్నాకు దిగారు. నిన్న పెన్షన్ విషయంలో అసెంబ్లీలో మాటల యుద్దం జరిగింది.  ఈ నేపథ్యంలో ముగ్గురు టీడీనీ ఎమ్మెల్యేలు  అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే సభాపతి తమను అన్యాయంగా సస్పెండ్ చేశారని నిన్నటి నుంచి ఆ ముగ్గురు నేతలు మీడియాలో సాక్షిగా గగ్గోలు పెడుతున్నారు. 

తాజాగా లుగుదేశం సభ్యులు అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడులను తిరిగి అసెంబ్లీలోకి పిలవాలని, వారిపై ఉన్న సస్పెన్షన్ వేటును వెనక్కు తీసుకోవాలని ఈ ఉదయం అసెంబ్లీ ప్రధాన గేటు ముందు చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం తో సహ మంత్రులు ప్రవేశించే మార్గంలో నిరసన చేయడంతో ఈ మార్గం సీఎంతో పాటు మంత్రులు ప్రయాణించే మార్గం కావడంతో పోలీసులు అప్రమత్తమై, భారీ ఎత్తున బలగాలను మోహరించారు.

తమకు తీవ్రమైన అన్యాయమని, తమ సభ్యులపై వేసిన వేటును వెనక్కు తీసుకోవాలని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: