ఇపుడీ అంశమే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబునాయుడుతో కలిసిన వీళ్ళెవరూ తమ రాష్ట్రాల్లో గెలవలేదు. పైగా అంతకుముందున్న సీట్లతో పోల్చితే దారుణంగా దెబ్బతిన్నారు. విచిత్రమేమిటంటే వీళ్ళలో చాలామందితో చంద్రబాబు తనకు మద్దతుగా ఏపిలో ప్రచారం చేయించుకున్నారు.

 

మొన్నటి ఎన్నికల్లో  కాంగ్రెస్ దారుణంగా దెబ్బతిన్నది. స్వయంగా అమేథిలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహూల్ గాంధీనే ఓడిపోయారు. దాంతో పార్టీ అధ్యక్ష పదవినే వదులుకున్నారు. అలాగే కర్నాటకలో  తాజాగా కుమారస్వామి సిఎం పదవిని కోల్పోయారు. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో కూడా దారుణంగా దెబ్బతిన్నారు.

 

అలాగే ఉత్తరప్రదేశ్ తీసుకుంటే భాగస్వామ్య పార్టీలైన అఖిలేష్ యాదవ్, మాయావతి బలం ఏమైందో కూడా తెలీలేదు. ఎస్సీ, బిఎస్పీలు కలిస్తే బిజెపి మటాషే అనుకున్నారు. కానీ సీన్ రివర్సయి వీళ్ళే దెబ్బతిన్నారు. ఇక ఢిల్లీలో కేజ్రీవాల్ కు కూడా గట్టి దేబ్బే తగిలింది.  పశ్చిమ బెంగాల్లో మమతాబెనర్జీకి  కూడా  గట్టి షాక్ తగిలింది.

 

మహారాష్ర్టలో అయితే శరద్ పవార్-కాంగ్రెస్ కూటమి గురించి చెప్పుకోనవసరమే లేదు. ఇక సొంత రాష్ట్రంలో  అజ్ఞాత మిత్రుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి ఎంత తక్కువ చెప్పుకున్నా ఎక్కువే. ఒక్క తమిళనాడు డిఎంకె అధినేత స్టాలిన్ మాత్రం చంద్రబాబు దెబ్బనుండి తప్పించుకున్నారంటూ సోషల్ మీడియాలో వ్యంగ్య పోస్టులు వైరల్ అవుతున్నాయి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: