మొన్నటి ఎన్నికల్లో జనాలు ఛీ కొట్టి ఘోరంగా ఓడించినా చంద్రబాబునాయుడు ఇంకా బురద రాజకీయాలు మానుకోవటం లేదు. అదేమిటో నిజం చెబితే తల వెయ్యి ముక్కలైపోతుందనే మునిశాపం చంద్రబాబునాయుడుకు ఉన్నట్లే అనిపిస్తోంది. అసెంబ్లీ తమకు మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదని చంద్రబాబు పదే పదే మీడియాతో చెబుతున్నారు.

 

చంద్రబాబు చెబుతున్నది పూర్తిగా అబద్ధమనే చెప్పాలి. చంద్రబాబు హయాంలో జగన్మోహన్ రెడ్డి మైక్ ఇచ్చిన దాంతో పోల్చుకుంటే ఇపుడు జగన్ హయాంలో చంద్రబాబుకు ఎక్కువ సమయమే దక్కుతోంది.  ఏ పార్టీకైనా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఎంఎల్ఏల బలం మీదే ఆదారపడుటుంది.

 

ఎంఎల్ఏల బలం తీసుకుంటే టిడిపికున్నది 23 మంది ఎంఎల్ఏలు మాత్రమే. కాబట్టి ఆ లెక్కలో తీసుకుంటే వాళ్ళు మాట్లాడేందుకు స్పీకర్ కేటాయించాల్సిన సమయం చాలా తక్కువగానే ఉంటుంది. కానీ జగన్ పెద్ద మనసుతో ఆలోచించి టిడిపికి దక్కాల్సిన సమయం కన్నా ఎక్కువే ఇవ్వమని స్వయంగా స్పీకర్ కు చెప్పారు. అందుకే చంద్రబాబు అండ్ కో నోటిక్కొచ్చినట్లు మాట్లాడగలుగుతున్నారు.

 

ఇక్కడే ఇంకో విషయం కూడా గమనించాలి. అదేమిటంటే జగన్ మాట్లాడుతున్నపుడు చంద్రబాబు మాట్లాడదలచుకుంటే వెంటనే జగన్ కూర్చుని మాజీ సిఎంకు మాట్లాడే అవకాశం ఇస్తున్నారు.  చంద్రబాబు హయాంలో ఇలాంటి సన్నివేశాలను అసెంబ్లీలో ఎవ్వరైనా చూశారా ? అప్పట్లో 67 ఎంఎల్ఏలున్న వైసిపికి అదే దామాషాలో మాట్లాడే అవకాశం ఇచ్చారా చంద్రబాబు ? అసెంబ్లీలో జగన్ మాట్లాడేందుకు ఎప్పుడు లేచినా తాము ఎంతగా అవమానించింది చంద్రబాబు మరచిపోయినట్లున్నారు. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు బురదరాజకీయాలు మానుకుంటే మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: