ఆదాయపు పన్ను దాఖలు చేసే వారికి ఐటి శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఆదాయపు పన్ను దాఖలు ఈ నెల 31తో గడువు ముగియనుంది. ఈ గడువును నెలరోలకు అంటే ఆగష్టు 31 వరకు పెంచనున్నట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై ఆదాయపు పన్ను దాఖలు చేసే వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఐటి రిటర్న్స్ సమర్పణ గడువును పెంచాలని వచ్చిన డిమాండ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐటి శాఖ తెలియజేసింది. గడువు ముగిసిన తరువాత కూడా ఫైన్ తో అప్లై చేసుకోవచ్చని ఐటి శాఖ వెల్లడించింది. 2019 డిసెంబర్ 31 వరకు అయితే రూ.5 వేల ఫైన్, 2020 మార్చ్ 31 వరకైతే రూ.10 వేల ఫైన్ తో ఐటి రిటర్న్స్  లు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.

ఐటి రిటర్న్స్ చెల్లించాలంటే చార్టర్ అకౌంట్ దగ్గరకి వెళ్లి లేదా కొంత మంది దళారుల దగ్గరకి వెళ్లి చెల్లిస్తుండేవారని, కానీ ఇప్పుడు ఆ అవసరం లేదని, గూగుల్ లోనే "క్లియర్ టాక్స్ "  అని కొడితే  "ఫ్రీ ఇన్కమ్ టాక్స్  ఈఫిల్లింగ్ ఇన్ ఇండియా" అని వస్తునందని తెలిపింది. "ఈ ఫైల్ నౌ" అనే ఆప్షన్ని క్లిక్ చేసి ,పూర్తీ వివరాలు లోడ్ చేసి, ఒక అరగంటలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఐటి రిటర్న్స్  లను చెల్లించుకోవచ్చని తెలిపింది. దీనిని అందరు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం తెపిలింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: