కేంద్ర హోంశాఖ సహాయ  మంత్రి,సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు కిషన్ రెడ్డికి బెదిరింపు కాల్స్ చేస్తున్న వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. గత కొద్ది సంవత్సరాలుగా కిషన్ రెడ్డిని ఫోన్లో బెదిరిస్తున్న వ్యక్తి, కడప జిల్లాకు చెందిన షేక్ ఇస్మాయిల్‌గా గుర్తించారు. బెదిరింపు కాల్స్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ అనంతరం ఇస్మాయిల్‌‌ను అరెస్ట్ చేశారు.


కాగా ఇస్మాయిల్ ఇంటర్నెట్ వాయిస్ కాల్ ద్వారా  బెదిరింపు కాల్స్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడ ఇస్మాయిల్ బెదిరించాడు. దీంతో కిషన్ రెడ్డి పోలీసులకు పిర్యాధు చేశాడు. ఈనేపథ్యంలోనే పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసులకు పట్టుబడ్డ ఇస్మాయిల్ కువైట్‌లో క్యాబ్ డ్రైవర్‌గా పని చేసి తిరిగి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కడప జిల్లాలో నివసిస్తున్నట్టుగా సమాచారం .


 ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు  కిషన్ రెడ్డి తనకు వస్తున్న బెదిరింపు కాల్స్ గురించి పోలీసులకు ఫిర్యాదు చేయగా , పెద్దగా పట్టనట్లు వ్యవహరించారు . అయితే ఇటీవల ఆయన  కేంద్ర హోం శాఖ సహాయ  మంత్రి పదవి బాధ్యతలు చేపట్టడం తో  పోలీసులు  సీరియస్‌గా తీసుకుని పక్కా   స్కెచ్ వేసి పట్టుకున్నట్టు సమచారం. అరెస్ట్ చేసిన


మరింత సమాచారం తెలుసుకోండి: