దక్షిణాది రాష్ట్రాల్లో బలపడాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ )  ఇతర పార్టీల నాయకులతోపాటు , వివిధ రంగాల ప్రముఖులను తమ పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు చేస్తోంది . దాంతో దక్షిణాదిలో బలపడవచ్చునని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది . ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో ఆపరేషన్ కమల్ లో భాగంగా ఇప్పటికే ఇతర పార్టీలకు చెందిన పలువురు బీజేపీ లో చేరిన విషయం తెల్సిందే .


తాజాగా దక్షిణాది భాషల్లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి బీజేపీ లో చేరనున్నట్లు తెలుస్తోంది .  సూపర్ స్టార్  రజినీకాంత్ స్వీయ నిర్మాణంలో వచ్చిన తమిళ చిత్రం వళ్ళి ద్వారా చిత్ర రంగానికి పరిచయం అయిన హీరోయిన్  ప్రియారామన్. తమిళ , తెలుగు , మళయాళ , కన్నడ , హిందీ చిత్రాలలో నటించిన ప్రియరామన్ , మంచి నటిగా గుర్తింపు పొందారు . నటిగా అవకాశాలు తగ్గడం తో ఆమె ఇకపై పూర్తిస్థాయి లో రాజకీయాల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది .


 ప్రధాని మోడీ నాయకత్వ లక్షణాలకు ఆకర్షితురాలైన ప్రియరామన్ , బీజేపీ లో చేరాలనుకున్నట్లు తెలుస్తోంది .. తమిళ , తెలుగు , మళయాళం , కన్నడ , హిందీ , ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడే ప్రియారామన్ చేరికతో దక్షిణాది రాష్ట్రాల్లో తమకు లాభిస్తుందని బీజేపీ  నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం .   ఇక ప్రియా రామన్ మేనేజర్ గా వ్యవహరించే రామానుజం చలపతి,  నగరి టీడీపీ  లో కీలక నాయకుడు కావడం   గమనార్హం


మరింత సమాచారం తెలుసుకోండి: