ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచబ్యాంకు రుణం ఇవ్వడం లేదని ప్రకటించింది. అది కూడా కేంద్రం నిర్ణయం మేరకేనని తేల్చిచెప్పింది. అయితే ఈ పరిణామాన్ని జగన్ ఫెయిల్యూర్ గా చిత్రీకరించేందుకు ఎల్లో మీడియా శతవిధాలుగా తంటాలు పడుతోంది.


ముందు ఇది జగన్ ఫెయిల్యూర్ అన్నారు. ఆ తర్వాత కేంద్రమే వద్దని చెప్పిందని తెలిశాక కామ్ అయ్యారు. ఆ తర్వాత.. జగన్ కు మరో షాక్ అంటూ ఇంకో వార్త వదిలారు. అదేంటంటే.. ఇప్పుడు ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏఐఐబీ) కూడా రుణం ఇచ్చేందుకు వెనక్కుతగ్గిందని కొత్త ప్రచారం మొదలుపెట్టారు.


అసలు విషయం ఏంటో సీఎంఓ ఓ ప్రకటనలో వివరించింది. తాజాగా ఏఐఐబీ రుణ ప్రతిపాదన ఉపసంహరించుకోవడం ప్రభుత్వానికి మరో దెబ్బగా చేస్తున్న ప్రచారాన్ని ఖండించింది. అసలు విషయం ఏంటంటే... అమరావతికి ప్రతిపాదిత రుణ ప్రాజెక్టులో వరల్డ్‌ బ్యాంకుతో పాటు ఏఐఐబీ కూడా భాగస్వామే. కేంద్రం తీసుకున్న నిర్ణయం ఈ ప్రాజెక్టులోని భాగస్వాములందరికీ వర్తిస్తుంది.


అమరావతి సుస్థిర మౌలిక వసతులు, సంస్థాగత అభివృద్ధి ప్రాజెక్టు అంచనా వ్యయం 715 మిలియన్‌ డాలర్లు. దీనిలో ప్రపంచబ్యాంకు 300 మిలియన్‌ డాలర్లు, ఏఐఐబీ 200 మిలియన్‌ డాలర్లు రుణంగా ఇద్దామనుకున్నారు. ఇందుకు కేంద్రం అడ్డుచెప్పడంతో ఈ రెండు బ్యాంకులూ వెనుకడుగు వేశాయి. ఇదంతా ఒక్కటే వార్త. దీన్ని రెండు ముక్కలు చేసి ఎల్లో మీడియాలో పదే పదే ప్రచారం చేయడం జగన్ ప్రతిష్టను దిగజార్చేందుకే అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. దటీజ్ ఎల్లో మీడియా.


మరింత సమాచారం తెలుసుకోండి: