ఏపీ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట ఘటన ప్రస్తావనకు వచ్చింది. ఈ తొక్కిసలాటలో 29 మంది భక్తులు మరణించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి 29మంది అమాయకుల ప్రాణాలు తీసుకున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు.


పుష్కరాల పేరు చెప్పి టీడీపీ నేతలు అడ్డగోలుగా వందల కోట్లు మింగేశారని వైసీపీ ఎమ్మెల్యేలు జోగి రమేష్, జక్కంపూడి రాజా ఆరోపించారు. గోదావరితో పాటూ కృష్ణా పుష్కరాల్లో వేలాది కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. పుష్కరాల జరుగుతున్న సమయంలో 29 మంది అమాయకుల మరణానికి బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు.


డైరెక్టర్ బోయపాటి శ్రీనును అక్కడ షూటింగ్‌ చేయమని ఎవరు చెప్పారు.. బోయపాటి శ్రీనుకు పుష్కరాలతో ఏం సంబంధమం అంటూ నిలదీశారు. వీఐపీ ఘాట్ పక్కనే ఉన్నా.. చంద్రబాబు ఎందుకు సాధారణ ఘాట్‌లో పుష్కర స్నానం చేశారని ప్రశ్నించారు. 29మంది చనిపోయినా కనీసం ఒక్కరిపై చర్యలు తీసుకోలేదని వైసీపీ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు.


29 మంది చనిపోవడానికి చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి కారణమని వైసీపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. ఈ ఘటనపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని.. సభాసంఘం వేయాలని వైసీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: