టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినోత్సవం సంద‌ర్భంగా పార్టీ శ్రేణులు వివిధ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాజకీయ నాయకులు, సినీ నటులు, ఇతర రంగాల ప్రముఖులు కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సుదీర్ఘకాలం ఆరోగ్యంతో సంపన్నంగా జీవించాలని ఆయన ఆకాంక్షించారు. దీనికి కేటీఆర్ సైతం అదే రీతిలో స్పందించారు. థ్యాంక్యూ బావా అంటూ త‌న స్పంద‌న తెలియ‌జేశారు. 


ఇదిలాఉండ‌గా, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఎంపీ సంతోష్ గిఫ్ట్ ఏ స్మైల్ అనే ఛాలెంజ్‌ని స్పూర్తిగా తీసుకొని కీసరగుట్ట రిజర్వ్‌ ఫారెస్ట్‌లోని 2042 ఎకరాల అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్న సంగ‌తి తెలిసిందే. అంతేకాదు ఈ ఛాలెంజ్‌ని ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి, మాజీ ఎంపీ కవిత, విజయ్‌ దేవరకొండ, నితిన్‌లకు విసిరారు. ఈ క్ర‌మంలో ఛాలెంజ్‌ని స్వీక‌రించిన‌ హీరో నితిన్ త‌న పెర‌ట్లో ఓ మొక్క‌ని నాటాడు. గిఫ్ట్ ఏ స్మైల్ ఛాలెంజ్ అనే కార్య‌క్ర‌మం మంచి ప్ర‌య‌త్నం. ఇలాంటి సామాజిక బాధ్య‌త‌లో న‌న్ను భాగం చేసినందుకు సంతోష్ కుమార్ గారికి కృత‌జ్ఞ‌తలు తెలియ‌జేస్తున్నాను. మన ప్రపంచాన్ని అందంగా మార్చడంలో మా బాధ్యతలు గుర్తుచేసే ఏ సవాలునైనా స్వీక‌రించ‌డానికి ఎల్లప్పుడూ సిద్ధమే. నా ప‌ని పూర్తి చేశాను. ఇప్పుడు మీ( ఫాలోవ‌ర్స్) స‌మ‌యం ఆస‌న్న‌మైంది. హ్యాపీ బ‌ర్త్ డే కేటీఆర్ గారు అని నితిన్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.


కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణభవన్‌లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వాసుదేవరెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్ రక్తదాన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. చిన్న వయసులోనే కేటీఆర్ ఎంతో పేరు తెచ్చుకున్నారు. కేటీఆర్ యువతకు మార్గదర్శి అన్నారు. గెల్లు శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో యువతను కేటీఆర్ ఎంతగానో ప్రోత్సహిస్తున్నారన్నారు. బాల్క సుమన్ మాట్లాడుతూ.. దేశంలోనే విలక్షణమైన నాయకుడు కేటీఆర్ అన్నారు. ఐటీ మంత్రిగా హైదరాబాద్ ఇమేజ్‌ను పెంచారన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: