రాజకీయం అన్నాక ఎపుడూ ఒకేలా ఉండదు, అది అటూ ఇటూ మారుతూ ఉంటుంది. దాంతో అధికారంలో ఉన్న వారు కింద పడతారు, కింద ఉన్న వారు మీదకు వస్తారు. ఏపీలో చూసుకుంటే టీడీపీ దారుణంగా చితికిపోయింది. ఆ పార్టీ మళ్ళీ బతికి కట్టాలంటే జనంలో ఆదరణ ఉందని ప్రూవ్ చేసుకోవాలి.


అందుకే లోకల్ బాడీ ఎన్నికల కోసం టీడీపీ అపుడే రెడీ అయిపోతోంది. దానికి తోడు రాజకీయ వ్యూహాలకు కూడా పదును పెడుతోంది. ఈ నేపధ్యంలో మళ్లీ తెలుగుదేశం, జనసేనలు పొత్తు పెట్టుకుంటాయా? అన్న ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికలలో ఈ రెండు పార్టీలు తీవ్రమైన ఓటమికి గురయ్యాయి. టిడిపికి 23 స్థానాలే దక్కితే, జనసేన కేవలం ఒక సీటును మాత్రమే గెలుచుకుంది.


వచ్చే మున్సిపల్ ఎన్నికల సమయానికి మళ్లీ పొత్తు పెట్టుకుంటే తప్ప వైసీపీకి పోటీ  ఇవ్వలేమన్న భావనతో ఉన్న టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ఈ ప్రతిపాదనను తన సన్నిహితుల వద్ద చేశారని తెలుస్తోంది  ఇక మరో వైపు  జనసేనలో కూడా రెండు పార్టీల పొత్తుపై కొంత సానుకూలత ఉందని అంటున్నారు. ఏపీలో రాజకీయంగా మళ్ళీ లేవాలంటే ఒంటరిగా పోటీకి దిగితే కష్టమన్న ఆలోచనలో జనసేన కూడా ఉంది. 


టీడీపీ పట్ల మొదటి నుంచి పవన్ కి మంచి అభిప్రాయం ఉన్నందువల్ల రెండు పార్టీలు చేతులు కలపడం పెద్ద విషయం కాదని అంటున్నారు.  ఈ నేపద్యంలో  టిడిపి, జనసేనలు మళ్లీ కలిసి లోకల్ బాడీ ఎన్నికల్లో ఉమ్మడిగా  పోటీచేస్తాయా అన్న చర్చ జరుగుతోంది. అదే జరిగితే జగన్ కి షాక్ తప్పదేమో. 


మరింత సమాచారం తెలుసుకోండి: