తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు ట్విట్టర్ పిట్ట నారా లోకేష్ పై ట్విట్టర్ వేధికగా పంచులు పేలుతున్నాయి. నారా లోకేష్ చేసే ట్విట్లను భరించలేని నెటిజన్లు మండిపడుతూ కామెంట్లు చేస్తున్నారు. 


నారా లోకేష్ ట్విట్టర్ వేధికగా వైఎస్ జగన్ చెప్పిన 45 ఏళ్లకే పిన్షన్ హామీ'పై స్పందిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. వైఎస్ జగన్ ఎన్నికల ముందు వరుకు 45 ఏళ్ళ వయసు వారికే పిన్షన్ ఇస్తా అన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక నేను ఆలా అనలేదు తూచ్ 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు మాత్రమే నన్ను పిన్షన్ అడగండి అని అంటున్నారు అని ఒకసారి కామెంట్ చేస్తే ... 


మరొకసారి వైఎస్ జగన్ కి సీఎం ఉద్యోగం వచ్చిందే 46 ఏళ్లకు ఇంకా అయన ఎప్పుడు 45 ఏళ్ళ వారికీ పిన్షన్ ఇవ్వాలి అంటూ కామెంట్ చేశారు. దీంతో ఈ కామెంట్ చుసిన నెటిజన్లు '' 'జగన్'కి 46 ఏళ్ళకి అయిన ఉద్యోగం వచ్చింది.. నీకు 70 ఏళ్ళు వచ్చిన ఉద్యోగం రాదు లోకేశం... ఇది పక్క'' అంటూ కామెంట్ చేశారు. దీంతో ఈ కామెంట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.  
   


మరింత సమాచారం తెలుసుకోండి: