38 ఏళ్ళ చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ 46 ఏళ్ళ యువ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయిన సంగతి అందరికి తెలిసిందే. అంతటి చరిత్ర ఉన్న తెలుగు దేశం పార్టీ అఫీషియ‌ల్‌ ట్విట్టర్ ఖాతాలో 'కుళ్ళు జోకులు' వేస్తున్నారు. దాదాపు 20ఏళ్ళు ఆంధ్ర ప్రదేశ్ ని పరిపాలించిన తెలుగు దేశం పార్టీ అఫీషియ‌ల్‌ ట్విట్టర్ ఖాతాలో కుళ్ళు జోకులు వేస్తున్నారు. 


అధికారక ఖాతాలో పాలకపక్షంలో వారు అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారు అనేది చెప్పచు, ప్రజలకు అన్యాయం జరుగుతుంది అని తెలియచేయచ్చు, ఇవ్వాల్సిన హామీలు ఇవ్వకుంటే గుర్తుచెయ్యచ్చు కానీ ఒక వ్యక్తి చేసిన ఫోటోని తీసుకొచ్చి ఇది మన అసెంబ్లీ .. ఇది మన ఖర్మ అంటూ నవ్వొచ్చే పనులు అధికారక అకౌంట్ లో చెయ్యకూడదు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 


తెలుగుదేశం పార్టీ అంటే ప్రస్తుతం ట్విట్టర్ పార్టీ అని, తెలుగు దేశం పార్టీ అంటే కామెడీ పార్టీ అని ప్రజలు అనుకునేలా తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు మాజీ ఎంపీ నారా లోకేష్ ట్విట్లు చేస్తున్నారు. నారా లోకేష్ ట్విట్ చుసిన ప్రతిఒక్కరు ధైర్యముంటే మీడియా ముందు మాట్లాడు ఇలా తేరా వెనుక ఉండి మాట్లాడకు అని కామెంట్లు చేస్తున్నారు. కాగా తెలుగు దేశం పార్టీ నేతలు చేసే పనులు చూస్తుంటే వచ్చే ఎన్నికల వరుకు పార్టీ ఉంటుందా ? భూస్థాపితం అవుతుందా అని ప్రశ్నలు వేస్తున్నారు నెటిజన్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: