ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు ఉంది కేశినేని నాని ప్రవర్తన. 2019 ఎన్నికల్లో టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిపోయేసరికి టీడీపీ పార్టీపై  కేశినేని నానికి మమకారం తగ్గిపోయిందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నికల ఫలితాల తర్వాత కేశినేని నాని ఎన్ని వేషాలు వేశాడో ఆంధ్ర ప్రజలందరికీ తెలుసు.


ఆ వేశాలన్నిటిని చూసి టీడీపీ పార్టీకి కేశినేని నాని గుడ్ బై చెప్పి బీజేపీలో జంప్ ఏమో అని అందరూ అనుకున్నారు కానీ చెయ్యలేదు. మొన్నటికి మొన్న బుద్ధా వెంకన్న కేశినేని నాని ట్విట్టర్ వేధికగా చిన్నపాటి యుద్ధాలే చేసుకున్నారు. ఆ యుద్ధం ఆపమని అధిష్టానం చెప్తే రాజీనామా చేస్తా కానీ ఈ ట్విట్ వార్ ఆపాను అని గత వారమంతా నెటిజన్లను ఎంటర్టైన్ చేశాడు నాని. 


ఈ వారం ఏమో 'వైసీపీ'పై పడ్డాడు. ఈరోజు ఉదయం ఏమో ఆంధ్ర ముఖ్యమంత్రి అని మర్యాద కూడా లేకుండా వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి మీడియాకు ఎక్కాడు, ఇప్పుడేమో అగ్రిగోల్డ్ భాదితుల కోసం పార్లమెంట్ లో డిమాండ్ చేశాను అంటూ వీడియో పెట్టాడు. దీంతో నెటిజన్లు బూతులు తిడుతున్నారు. 


'రాష్ట్రంలో ఇచ్చిన హామీని కేంద్రంలో అడగటం ఏంటయ్యా' అని ఒకరు అడుగుతే, మరొకరు 'మన టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే అగ్రిగోల్డ్ భాదితుల కోసం ఎం చెయ్యలేకపొయ్యాం..! కొత్త రాజ్యం ఎం చెయ్యగలదు' అని ఇంకొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం 'కేశినేని నాని'పై కారాలు మిరియాలు నూరేస్తున్నారు. 


'కొత్త ప్రభుత్వం వచ్చి కనీసం రెండు నెలలు కూడా అవ్వలేదు, అప్పుడే అది చెయ్యలేదు ఇది చెయ్యలేదు అంటూ విమర్శలు చేస్తున్నారు, కొంచమైనా ఉండాలి తెలివి. 5 ఏళ్ళు రాజ్యంలో ఉన్న మిరే ఎం చెయ్యలేక పొయ్యారు. మళ్ళి ఇప్పుడు మాట్లాడుతున్నారు' అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.   


మరింత సమాచారం తెలుసుకోండి: