నేతాజీ సుభాష్ చంద్రబోస్‌పై సమాచారం కోరుతూ 2014 నుంచి భారత్ రష్యాకు పలు అభ్యర్థనలు చేసింది, కాని స్వాతంత్ర్య సమరయోధుడికి సంబంధించిన రష్యన్ ఆర్కైవ్స్‌లో ఎలాంటి పత్రాలు దొరకలేదని మాస్కో తెలియజేసింది.

లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో విదేశాంగ శాఖ మంత్రి వి మురళీధరన్ మాట్లాడుతూ, నేతాజీ 1945 ఆగస్టుకు ముందు లేదా తరువాత ఎప్పుడైనా రష్యాలో ఉన్నారా, 1945 ఆగస్టులో రష్యాకు పారిపోయారా లేదా అనేది తెలియాలనుంది అన్నారు.

భారత ప్రభుత్వం, 2014 నుండి పలు అభ్యర్ధనలలో, నేతాజీకి సంబంధించిన పత్రాలు లేదా సామగ్రిని రష్యాను కోరింది.

"దాని ప్రతిస్పందనలో, రష్యా ప్రభుత్వం నేతాజీకి సంబంధించిన రష్యన్ ఆర్కైవ్లలో ఎటువంటి పత్రాలను కనుగొనలేకపోయిందని, భారతదేశం నుండి వచ్చిన అభ్యర్థన ఆధారంగా అదనపు దర్యాప్తు చేసిన తరువాత కూడా, వారు మరింత సమాచారం ఇచ్చే పత్రాలను కనుగొనలేకపోయారని " మురళీధరన్ అన్నారు.

జపాన్ దళాల మద్దతుతో బ్రిటిష్ వారితో పోరాడటానికి నేతాజీ బోస్ 1942 లో ఇండియన్ నేషనల్ ఆర్మీని (ఆజాద్ హింద్ ఫౌజ్ ని) స్థాపించారు.  ఆగష్టు 18, 1945 న తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించినట్లు భావిస్తున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: