ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి కి ఇస్తున్న భద్రత విషయం లో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశం లోని అందరి నాయకులకు ఇస్తున్న ఎస్పీజీ ఎన్ఎస్జీ భద్రత విషయం లో కేంద్ర హోంశాఖ సమీక్ష జరిపింది ఈ సమీక్ష లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు .


ముఖ్యం గా ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం సమాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కు ఇస్తున్న బ్లాక్ క్యాట్ కమాండో సెక్యూరిటీ పూర్తి గా తొలగించారు. అఖిలేష్ యాదవ్ విషయం లో సమీక్ష జరిపి ఆయన కు జడ్ ప్లస్ రక్షణ ఇచ్చే అవసరం లేదని కేంద్ర హోంశాఖ తేల్చి చెప్పింది. అఖిలేష్ సీఎం అయిన తర్వాత ఆయనకు ఇరవై రెండు మంది తో ఎన్ఎస్జీ కమాండో బృందం తో భద్రత కల్పించారు. అయితే ఇప్పుడు సమీక్ష జరిపి ఆయనకు షాకిచ్చారు అయితే అఖిలేష్ తండ్రి ములాయంకు మాత్రం జడ్ ప్లస్ భద్రత కొనసాగుతుంది.


ఇలా అందరికీ సమీక్ష జరిపి దేశం లో మొత్తం ఇరవై నాలుగు మంది నేతలకూ వీఐపీల భద్రత కవర్ నుంచి కేంద్రం ఉపసంహరించుకుంది. ఇక మన రాష్ర్టానికి వస్తే జగన్మోహనరెడ్డి అధికారంలో వచ్చిన దగ్గరి నుంచి చంద్రబాబు భద్రత విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నారో చూశాం ఆయన కు పూర్తి గా భద్రత తొలగించారు.అయితే చంద్రబాబు జడ్ ప్లస్ భద్రత కేంద్ర పరిధి లోది కావటంతో దాంట్లో ఎలాంటి మార్పు చేయలేదు.


దీంతో ఇప్పటికే జగన్ మోదీ తో క్లోజ్ గా ఉండడం ఢిల్లీ లో కూర్చుని విజయసాయిరెడ్డి పుల్లల పెడుతుండటం తో కేంద్రం కూడా చంద్రబాబు కు జడ్ ప్లస్ భద్రత తొలగిస్తుందని అందరూ భావించారు. కానీ కేంద్ర హోమ్ శాఖ సమీక్ష లో చంద్రబాబు కు జడ్ ప్లస్ భద్రత కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.


ముఖ్యంగా రాష్ట్రం లో ఉన్న రాజకీయ వైరం పర్సనల్ స్థాయి లో ఉండటం జగన్ ప్రభుత్వం కక్ష సాధింపులు అలాగే నక్సల్స్ నుంచి ముప్పు, ఎర్రచందనం మాఫియా నుంచి ముంపు ఇవన్నీ పరిగణలోకి తీసుకుని చంద్రబాబు కి జడ్ ప్లస్ భద్రత ఉండాల్సింది అని కేంద్రం నిర్ణయం తీసుకుంది.


చంద్రబాబు తో పాటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్, అస్సాం రాష్ట్ర ముఖ్య మంత్రి సర్బానంద సోనోవాల్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాతో పాటుగా మరో పన్నెండు మంది కి ఎన్ఎస్జీ భద్రత కొనసాగించనున్నారు. ఇక మరో పక్క జగన్ ప్రభుత్వం తనకు భద్రత పూర్తి గా తొలగించడం పై చంద్రబాబు ఇప్పటికే కోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్ కోర్టు లో విచారణ దశలో ఉంది భద్రతాపరమైన అంశం కాబట్టి ఓపెన్ కోర్టు లో విచారణ జరపలేమని ప్రభుత్వం చెప్పడంతో ఈ కేసు విచారణ ఎంత వరకు వచ్చిందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: