పెన్షన్ ల పెంపు నుంచి రైతు భరోసా వరకు సున్నా  వడ్డీ నుండి డ్వాక్రా రుణ మాఫీ వరకూ  అన్నింటిలోనూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  మాట మార్చి మడమ తిప్పుతున్నారని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేలు  మండిపడుతున్నారు .   45 ఏళ్ల కే ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ మహిళలకు ఫించను ఇస్తామని జగన్ ప్రతీ రోజు పాద యాత్రలో చెప్పారనీ ఇప్పుడు మాత్రం ఆహామీ ని తుంగలో తొక్కి వారిని మోసం చేస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు .   ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ లకు జరుగుతున్న మోసం పై ప్రజల తరుపున ప్రశించిన ముగ్గురు టి డి పి సభ్యులను సస్పెండ్ చేయటం ఏంటనీ ,  ఇది ప్రజా స్వామ్య మా లేక… పులివెందుల స్వమ్యామా అంటూ ప్రశ్నిస్తున్నారు .  దేశానికి ఆదర్శంగా సభను నడుపుతాం అని స్పీకర్ తన ప్రమాణ స్వీకారం నాడు చెప్పి ,   ప్రజాగళం వినిపించిన వారిని సస్పెండ్ చేయటమే దేశానికి ఆదర్శమా అంటూ నిలదీస్తున్నారు .


నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య , జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య లు వేర్వేరుగా మీడియా తో మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంపై , ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలపై విరుచుకుపడ్డారు .  అసెంబ్లీ లో ప్రజా ఆకాంక్షలు బలంగా వినుపిస్తున్న 23 మండి టి డి పి శాసనసభ్యుల గొంతు నొక్కగలరేమో గాని 5 కోట్ల ఆంధ్రుల గొంతు నొక్కలేరని అన్నారు.  ఎన్నికలకు ముందు నవరత్నాలంటూ  నమ్మ బలికారనీ అధికారం లోకి వచ్చాక  ఒక్క రత్నమైనా సరిగా అమలు చేశారా ? అంటూ ప్రశ్నిస్తున్నారు .  రైతు భరో సా కింద ఏటా రూ. 12,500 ఇస్తామని చెప్పి  ఇప్పుడు మాత్రం రూ . 6,500 మాత్రమే ఇస్తామని రైతులను మోసం చేస్తున్నారని విమర్శిస్తున్నారు .  నవరత్నాల ప్రచారానికి ఇచ్చిన ప్రాదాన్యతలో నూరవ వంతు కూడా అమలుపై చూపటం లేదని మాజీ ఎమ్మెల్యేలు  ఆరోపిస్తున్నారు  .  ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ మహిళలకు 45 ఏళ్లకే పింఛన్ ఇస్తానంటూ అనంతపురం జిల్లా ధర్మవరం గొంతు చించుకొని మాట్లాడిన జగన్ మోహన్ రెడ్డి అమలు విషయంలో ఎందుకు మడమ తిప్పారని ప్రశ్నిస్తున్నారు .


 పెన్షన్ రూ. 3000 చేస్తామని చెప్పి చివరకు రూ. 250 మాత్రమే పెంచి వయోవృద్దుల ఆశలపైన నీళ్ళు చల్లారని ,  ఇప్పటి వరకు మహిళలకు అందిస్తామని చెప్పిన రూ. 75,000 గురించి అసెంబ్లీ సమావేశాల్లో అసలు ప్రస్తావనే లేదని  విమర్శిస్తున్నారు  .   ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సమీక్షలలో కూడా ఎక్కడ ప్రస్తావించన ధాఖాలు లేవని పేర్కొంటున్నారు . అమ్మ ఒడి కార్యక్రమం లో భాగంగా  బడికి పంపే ప్రతీ తల్లికి రూ. 15000  ఇస్తామని పాద యాత్రలో ప్రకటించిన జగన్ ,  ఇప్పుడు అమ్మ ఒడి పథకాన్ని  ఇంట్లో ఒక్క పిల్లవాడికే అమలు చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని విమర్శిస్తున్నారు .

 


మరింత సమాచారం తెలుసుకోండి: