తెలుగుదేశం అధికారం కోల్పోయిన నాటి నించి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఫ్యామిలీకి చిక్కులు వచ్చిపడ్డాయి. గతంలో చేసిన అక్రమాలు నీడల్లా వెంటాడుతున్నాయి. అనేక మంది బాధితులు కోడెల కుటుంబ సభ్యులపై కేసులు పెట్టారు.


అసలే అధికారంలో వైసీపీ ఉంది. అందుకే ఆ కేసుల దర్యాప్తు కూడా చురుగ్గా సాగుతోంది. కోడెల కుటుంబ సభ్యుల అరెస్టులు కూడా తప్పవన్న ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కోడెల కుటుంబానికి హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది.


శివప్రసాద్ కుమార్తె పై వచ్చిన ఒక కేసులో హైకోర్టు స్టే ఇచ్చింది. ఆమెను అరెస్టు చేయవద్దని ఆదేశాలు ఇచ్చింది. నరసరావుపేట వన్‌టౌన్ పీఎస్‌లో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసులో విజయలక్ష్మిని అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు ఇంటెరిమ్ ఉత్దర్వులు ఇచ్చింది.


ఈ కేసులో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. అనంతరం కేసు విచారణను వచ్చే నెల 13వ తేదీకి వాయిదా వేసింది. ముందు ముందు పరిస్థితి ఎలా ఉండబోతున్నా ప్రస్తుతానికి మాత్రం కాస్త రిలీఫ్ దొరికినట్టే..


మరింత సమాచారం తెలుసుకోండి: