ఏపీలో సంప్రదాయ కులాలదే ఆధిపత్యం. ఈ సత్యం అందరికీ తెలిసిందే. పేరుకు కులం, మతం లేవు అంటారు, నేను ఏ కులానికి సంబంధించిన వాడిని కాను అంటూనే ఈ మధ్య ఓ పార్టీ నాయకుడు తమ కులం వారు ఎక్కువగా ఉన్న చోటు నుంచే పోటీ చేశాడంతే కుల ప్రాబల్యం ఎంతగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.


ఇదిలా ఉండగా వైసీపీ ఈ రోజు ఈ పరిస్థితుల్లో ఉన్నా, అధికారంలోకి వచ్చినా కూడా ఆ పార్టీకు వెన్నెముక రెడ్డి కులస్తులే. . రాయలసీమ మొత్తం 52 సీట్లకు గాను 48 సీట్లను వైసీపీ  గెలుచుకుందంటే అది రెడ్డిల కమిట్మెంట్. జగన్ సీఎం కావాలి. అధికారంలో మాకూ వాటా కావాలి. ఇదీ రెడ్డిల ఆలోచన. అందువల్లనే వారు జగన్ వెన్నంటి పదేళ్ళుగా  ఉన్నారు. ఇక మొత్తం 52 మంది రెడ్డిలకు జగన్ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇస్తే  అందులో  51 మంది గెలిచి ఉరవకొండ విశ్వేశ్వరరెడ్డి మాత్రమే ఓడాడంటే రెడ్డిల రాజకీయ బలం ఏంటన్నది తెలుస్తోంది.


మరి ఇంతలా రెడ్లు జగన్ని సపోర్ట్ చేస్తూఅంటే ఆయన మాత్రం కేవలం నలుగురుకే మంత్రి వర్గంలో పదవులు ఇచ్చాడు. ఇక తాజాగా ప్రవేశపెట్టిన రెండు బిల్లులు చూస్తే రెడ్డిలు ఇక వైసీపీ తమను పూర్తిగా పక్కన పెట్టేసిందా అన్న భావనలోకి వెళ్ళిపోతున్నారట. యాభై శాతం రిజ‌ర్వేషన్లు నామినేటెడ్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు  ఇవ్వడం, అలాగే కాంట్రక్టు పనుల్లో మరో యాభై శాతం వారికే  ఇవ్వడం వంటివి చూసిన రెడ్లు ఇక వైసీపీలో తమకు రాజకీయ మనుగడ లేదని భావిస్తున్నారని అంటున్నారు.


విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టి తాము రాజకీయం చేస్తే చేతులు కట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. మరి రెడ్లు కనుక రెడ్ సిగ్నల్ చూపిస్తే అది వైసీపీకే డేంజర్. వారే బలంగా ఏర్పడిన పార్టీ ఇపుడు రెడ్లను ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేస్తుందన్నది చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: